
దిన ఫలాలు (జూలై 3, 2026): మేష రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందడానికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో సమర్థవంతంగా బాధ్యతల్ని పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగంలో సానుకూల మార్పులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందడం, బాకీలు వసూలు కావడం వంటివి జరుగు తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది.
ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందడానికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
ఉద్యోగంలో సమర్థవంతంగా బాధ్యతల్ని పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. ఆశించిన స్థాయిలో వృత్తి, వ్యాపారాలు పురోగతి సాధిస్తాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. సోదర వర్గంతో సఖ్యత ఏర్పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాల్లో కొంత వరకూ సఫలమవుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగు తారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు.
వృత్తి, ఉద్యోగాలు సామరస్యంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలను గడించే అవకాశం ఉంది. ఆదాయం పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహా రాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. ప్రస్తుతానికి ఆర్థిక సమస్యల నుంచి బయట పడడం మీద శ్రద్ధ పెట్టాలి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొద్దిగా అనారోగ్యం ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. ప్రయాణాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.
వృత్తి, ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయం అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఫలితాలు ఉత్సాహం కలిగిస్తాయి. అదనపు సంపాదనకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. శత్రు, రోగ, రుణబాధల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాల వల్ల ఇబ్బంది ఉంటుంది. ఇంటా బయటా పనిభారం ఎక్కువగానే ఉన్నప్పటికీ అత్య వసర పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పిల్లలు ఆశించిన ఘన విజయాలు సాధిస్తారు.
ఉద్యోగంలో అధికారులతో సామరస్యంగా వ్యవహరిస్తారు. పనితీరుకు గుర్తింపు, ప్రతిఫలం లభి స్తాయి. వ్యాపార వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు తగిన ప్రతి ఫలం పొందుతారు. వృత్తి జీవితంలో సొంత ఆలోచనల వల్ల లాభం ఉంటుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల విమర్శల్ని పట్టించుకోకపోవడం మంచిది. ఇంటి పరిస్థితుల్ని చక్కదిద్దుతారు. అనుకోకుండా వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగు తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమ స్యల నుంచి బయటపడతారు. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం సంపాదించుకుంటారు. కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందు తాయి. సామాజికంగా గౌరవ సత్కారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్ర మా లలో పాల్గొంటారు. అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహా రాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది.
ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయావకాశాలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమస్యల విషయంలో స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల చదువుల విషయంలో సంతృప్తి చెందుతారు. అనుకోకుండా మంచి పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఆధ్యా త్మిక చింతన బాగా పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొన్ని ఆలయాలు సందర్శిస్తారు.
వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సా హకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో పోటీదారుల ఒత్తిడి బాగా తగ్గుతుంది. బంధువులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యక్తిగత విషయాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అవనసర ఖర్చులను అదుపు చేస్తారు. కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పట్టి మనశ్శాంతి ఏర్పడుతుంది.
ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. కొందరు బంధుమిత్రుల నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. సన్నిహిత మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ప్రయత్నాల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది.
Also Read: అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు