గురు అనుగ్రహం.. ఈ 3 రాశుల వారికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు!

Jupiter Nakshatra Transit 2026: అక్టోబర్ 8న గురువు నక్షత్ర మార్పు చేయనున్నట్లు జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఈ మార్పు కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా కర్కాటకం, సింహం, తుల రాశుల వారికి కెరీర్, ఆర్థిక పరిస్థితి, విద్య, కుటుంబం, వ్యాపారం వంటి విషయాల్లో శుభ పరిణామాలు చోటుచేసుకోవచ్చని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి.

గురు అనుగ్రహం.. ఈ 3 రాశుల వారికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు!
Jupiter Blessings

Updated on: Oct 06, 2026 | 8:07 PM

గురు నక్షత్ర గోచారం 2026: జ్యోతిషశాస్త్రంలో దేవగురువు బృహస్పతి (గురుడు)కి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. గురు రాశి లేదా నక్షత్ర సంచారం వ్యక్తి విద్య, జ్ఞానం, కెరీర్, ఆర్థిక పరిస్థితి, వివాహం వంటి అంశాలపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 2026 అక్టోబర్ 8న గురువు నక్షత్ర మార్పు (Guru Nakshatra Gochar 2026) చేయనున్నట్లు జ్యోతిష్య ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ రోజున గురువు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగో పాదంలోకి ప్రవేశించనున్నారు. ఈ నెల చివర్లోనే గురువు సింహ రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో అక్టోబర్‌లో గురువు రెండు కీలక మార్పులు చేయడం ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరగడం, నాయకత్వ లక్షణాలు మెరుగుపడటం, విద్యలో పురోగతి, కెరీర్‌లో కొత్త అవకాశాలు రావడం వంటి ఫలితాలు ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే వివాహానికి సంబంధించిన కొన్ని అడ్డంకులు తొలగే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా మూడు రాశులకు ఈ గురు నక్షత్ర మార్పు మరింత అనుకూలంగా ఉండొచ్చని పేర్కొంటున్నారు.

కర్కాటక రాశి

గురు నక్షత్ర మార్పు కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశముంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఉద్యోగ, వృత్తి రంగాల్లో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి, వారితో కలిసి వ్యాపారం చేయాలనే ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో కూడా పురోగతి కనిపిస్తుంది. వ్యాపార రంగంలో కొత్త పరిచయాలు ఏర్పడి లాభాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

సింహ రాశి

సింహ రాశి వారికి గురు నక్షత్ర మార్పు అదృష్టాన్ని పెంచే సమయంగా ఉండే అవకాశముంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంటి సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ఇల్లు కొనుగోలు చేయాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్న వారికి అనుకూల పరిణామాలు చోటుచేసుకోవచ్చని అంచనా. కెరీర్ విషయంలో సానుకూల ఫలితాలు రావడంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరగడం లేదా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉండవచ్చని చెబుతున్నారు.

తుల రాశి

తుల రాశి వారికి కూడా గురు నక్షత్ర మార్పు ప్రయోజనకరంగా ఉండే అవకాశముంది. ఈ సమయంలో వ్యక్తిత్వ ప్రభావం పెరగడంతో ఇతరులను ఆకట్టుకుంటారు. తండ్రితో సంబంధాలు మెరుగుపడటంతో పాటు గురువులు, పెద్దల నుంచి సహకారం లభిస్తాయి. విద్య, కెరీర్‌కు సంబంధించిన ప్రయత్నాల్లో విజయావకాశాలు పెరిగే అవకాశముంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు అవి ఉపయోగపడుతుంది. వ్యాపార రంగంలో పురోగతి కనిపించడంతో పాటు ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. కొత్త అవకాశాలు కూడా అందుకుంటారు.

(ముఖ్య గమనిక: ఈ కథనంలోని అంశాలు జ్యోతిష్య శాస్త్రం, సంప్రదాయ విశ్వాసాలు, సాధారణ అంచనాల ఆధారంగా అందించబడుతున్న సమాచారం మాత్రమే. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైనవిగా పరిగణించరాదు. వ్యక్తిగత నిర్ణయాలకు వీటినే ఏకైక ఆధారంగా తీసుకోకండి)

Loading...
Unable to load recommendations.
Follow Us