Parivartan Yoga: అరుదైన పరివర్తన.. ఆ రాశుల వారికి అధికార, ధన యోగాలు..!

జ్యోతిషశాస్త్రం ప్రకారం, గురు, బుధ గ్రహాల మధ్య పరివర్తన విశిష్ట రాజయోగాలను కల్పిస్తుంది. డిసెంబర్ 29 నుండి జనవరి 17 వరకు ఈ శుభ యోగం ఏర్పడుతుంది. బుధుడి మిథున రాశిలో గురువు, గురువు ధనూ రాశిలో బుధుడు సంచరించడం దీనికి కారణం. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులవారికి ఈ కాలంలో ఉన్నత స్థానాలు, ఆర్థిక విజయం, వృత్తిలో పురోగతి ఖాయం.

Parivartan Yoga: అరుదైన పరివర్తన.. ఆ రాశుల వారికి అధికార, ధన యోగాలు..!
Parivartan Yoga

Edited By:

Updated on: Dec 19, 2025 | 7:12 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇతర గ్రహాలన్నిటికంటే గురు, బుధుల మధ్య పరివర్తన విశిష్టమైనది. ఈ పరివర్తన తిరుగులేని రాజయోగాలను ఇస్తుంది. ఈ పరివర్తన యోగం పట్టినవారు ఏ రంగంలో ఉన్నా తప్పకుండా ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. ఈ నెల (డిసెంబర్) 29 నుంచి జనవరి 17 వరకు గురు, బుధ గ్రహాల మధ్య పరివర్తన జరుగుతోంది. బుధుడికి చెందిన మిథున రాశిలో గురువు, గురువుకు చెందిన ధనూ రాశిలో బుధుడి సంచారం వల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులవారు అందలాలు ఎక్కే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి తృతీయ, భాగ్య స్థానాల్లో ఉన్న గురు, బుధుల మధ్య పరివర్తన జరగడం వల్ల జీవితంలో ఒక్కసారికిగా అధికార యోగం, ధన యోగం, విదేశీయాన యోగం, ధన ధాన్య సమృద్ధి యోగం వంటివి కలుగుతాయి. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. కొద్ది శ్రమతో అత్యధికంగా లాభం పొందడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవడం జరుగుతుంది.
  2. మిథునం: రాశ్యధిపతి బుధుడికి, సప్తమాధిపతి గురువుకు మధ్య పరివర్తన జరగడం వల్ల జనాకర్షణ బాగా పెరుగుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఒక నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలను మించి లాభిస్తాయి.
  3. సింహం: ఈ రాశికి పంచమ, లాభాధిపతులైన గురు, బుధుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించి పదోన్నతులు పొందడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది.
  4. తుల: ఈ రాశికి తృతీయ, భాగ్య స్థానాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించి సంపన్న కుటుంబంతో సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందడం జరుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదో న్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.
  5. ధనుస్సు: రాశ్యధిపతి గురువుకు, సప్తమాధిపతి బుధుడికి మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల ఈ రాశివారికి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆస్తి, ఆర్థిక సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఒకటికి రెండుసార్లు ధనయోగాలు పడతాయి.
  6. కుంభం: ఈ రాశికి పంచమ, లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి మనసులోని కోరి కలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయ అధికారం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.