Astrology: ఫిబ్రవరిలో కొన్ని రాశులవారు మహర్జాతకులు.. అందులో మీ రాశి ఉందా?

February Astrology 2025: ఫిబ్రవరి నెలలో గురువు వక్ర త్యాగం చేయబోతున్నాడు. దీంతో పాటు ఈ నెలలోనే రవి, బుధులు, శుక్రుడు రాశులు మారడం జరుగుతోంది. శుక్రుడు మీన రాశిలో, రవి, బుధులు కుంభ రాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ మార్పులు కొన్నిరాశులవారి జీవితాల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ మార్పులు కొన్ని రాశుల వారికి బాగా సిరి సంపదలను అనుగ్రహిస్తాయి.

Astrology: ఫిబ్రవరిలో కొన్ని రాశులవారు మహర్జాతకులు.. అందులో మీ రాశి ఉందా?
Febraury 2025 Astrology

Edited By:

Updated on: Jan 21, 2025 | 8:05 PM

Lucky Zodiac Signs in Feb 2025: ఫిబ్రవరి నెలలో గురువు వక్ర త్యాగం చేయడంతో పాటు, రవి, బుధులు, శుక్రుడు రాశులు మారడం జరుగుతోంది. ప్రస్తుతం వృషభ రాశిలో వక్రగతిలో ఉన్న గురువు వక్రాన్ని వదిలిపెట్టి సరైన మార్గంలో పయనిస్తాడు. శుక్రుడు మీన రాశిలో, రవి, బుధులు కుంభ రాశిలో సంచారం చేస్తారు. ఈ మార్పులు కొన్నిరాశులవారి జీవితాల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ఈ రాశి మార్పులు బాగా సిరి సంపదలను అనుగ్రహిస్తాయి.

  1. మేషం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న గురువు వక్ర త్యాగం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా సంపద వృద్ధి చెందుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా బాగా ఎదగడం జరుగుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతులతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది.
  2. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు గురువుతో పరివర్తన చెందుతున్నందువల్ల ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులు, అవివాహితులు ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. షేర్లు, స్టాకులు, స్పెక్యులేషన్లు అపార ధన లాభం కలిగిస్తాయి. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన అదృష్టం ఫిబ్రవరిలో మరింత బలంగా కొనసాగు తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన సొమ్ము, బాకీలు తప్పకుండా వసూలవుతాయి. ఉద్యోగంలో పురోగతి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. విదేశీ సొమ్ము అనుభవించే అవ కాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ఆరోగ్య లాభం కలుగుతుంది.
  4. కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న గురువు, సప్తమ స్థానంలో ఉన్న ఉచ్ఛ శుక్రుడి వల్ల అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి బాగా లాభాలు కలుగుతాయి. ఉద్యోగు లకు ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు లభిస్తాయి. వైవాహిక జీవితం, ప్రేమ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఊహించని రీతిలో విదేశీ అవకాశాలు లభిస్తాయి.
  5. వృశ్చికం: ఈ రాశికి అర్ధాష్టమ శని జరుగుతున్నప్పటికీ, గురు, శుక్ర గ్రహాల పరివర్తన వల్ల శని దోషం పూర్తిగా పరిహారమవుతుంది. ఇంట్లో కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది. అంచనా లకు మించిన ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. వారసత్వ సంపద లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది.
  6. మకరం: ఈ రాశివారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అనేక విధాలుగా అదృష్టం కలుగుతుంది. భారీగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. షేర్లు, స్టాకులు కనక వర్షం కురిపి స్తాయి. ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశా లకు వెళ్లే అవకాశం ఉంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.