
న్యూమరాలజీ ప్రకారం తొమ్మిదొవ తేదీన పుట్టిన వారు చాలా గుణవంతులు. వీరు ఏపనినైనా సరే చాలా సులభంగా చేయగల నేర్పులు. చాలా సౌమ్యంగా మాట్లాడుతారు. అన్ని విషయాల్లో ఆచీ తూచి నిర్ణయం తీసుకుంటారు. అంతే కాకుండా పెద్ద వారికి గౌరవం ఇవ్వడంలో కూడా వీరిని మించిన వారు లేరంట. చాలా సున్నితమైన వ్యక్తుల ఈ తేదీలో జన్మించిన వారు.

కానీ కొన్ని సార్లు మొండితనంగా ప్రవర్తిస్తరంట. ముఖ్యంగా తమకు నచ్చిన దాని విషయంలో మాత్రం పక్కా క్లారిటీతో ఉంటారంట. ఈ తేదీలో జన్మించిన వారు. ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారంట. అంతే కాకుండా వీరు ఏ రంగంలో ఉన్నా సరే మంచి పురోగతి సాధిస్తారు. వీరికి అదృష్టం కూడా ఎక్కువే ఉంటుందని చెప్తున్నారు నిపుణులు.

అంతే కాకుండా ఈ తేదీలో జన్మించిన వారు తమ జీవితంపై ఒక మంచి క్లారిటీతో ఉంటారంట. ముందే తమ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారం ముందుకు సాగుతారంట. అంతే కాకుండా ఈ తేదీలో జన్మించిన వారికి కష్టపడే తత్వ కూడా ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

ముఖ్యంగా ఈ తేదీలో జన్మించిన వారి వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుందంట. ఎందుకంటే వీరకి ప్రేమానురాగాలు చాలా ఎక్కువ. అంతే కాకుండా తమ జీవితంలోకి వచ్చిన వ్యక్తిని కూడా చాలా అపురూపంగా చూసుకుంటారంట.అంతే కాకుండా హృదయం ప్రేమతో నిండి ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించినవారు జీవిత భాగస్వామిని చాలా ప్రేమిస్తారు వారికి విలువనిస్తారంట.

అదే విధంగా వీరు పెళ్లి తర్వాత ఆర్థికంగా, చాలా ఎదుగుతారంట. కుటుంబంలోకలహాలు లేకుండా చేసుకుంటారంట. చాలా సంతోషంగా పిల్లలతో, తమ భాగస్వామితో ఆనందంగా గడుపుతారంట.