
దిన ఫలాలు (సెప్టెంబర్ 23, 2026): మేష రాశి వారికి వాహన యోగానికి అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి.
వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు పురోగతి చెందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. స్థిరాస్తికి సంబంధించిన అమ్మకాలు, కొనుగోళ్లలో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన యోగానికి అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు ఆశలు నెరవేరే సూచనలున్నాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు పురోగతి చెందుతాయి. ముఖ్య మైన పనుల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కూడా అందుతాయి. ఆదాయ ప్రయ త్నాలు సంతృప్తికరంగా సాగుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. మీ వల్ల బంధుమిత్రులు కొందరు ప్రయోజనం పొందుతారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా జీవిత భాగస్వామి మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు.
లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడిపరంగా పైచేయి సాధిస్తారు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ బాగా పెరు గుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగం విషయంలో శుభవార్త అందుతుంది. కొద్ది ప్రయాసతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది.
ఉద్యోగాలపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో పురో గమిస్తాయి. ముఖ్యమైన లావాదేవీలు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రయత్నాలు చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ముందుకు వస్తాయి. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలకు ఎదురుండదు. కుటుంబ జీవితం బాగా ప్రశాంతంగా సాగిపోతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికార వర్గాల నుంచి మంచి పేరు తెచ్చుకుం టారు. స్వల్ప ధన లాభ సూచనలున్నాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు బంధువులు, సన్నిహితులతో ఏర్పడ్డ వివాదాలు తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పిల్లలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పరవాలేదు.
ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద కొద్దిగా ఖర్చులు పెరుగుతాయి. కొందరు మిత్రులతో ఇబ్బందులు తలెత్తుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు కూడా నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో కొద్దిగా చికాకులు, సమస్యలు తప్పకపో వచ్చు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
పెళ్లి ప్రయత్నాల్లో అనుకోకుండా బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ ప్రయ త్నాలు కూడా సఫలమవుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొందరు మిత్రు లతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కొంత మేరకు సఫలం అవుతాయి. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితా లనిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుం బంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తలపెట్టిన పనులలో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ, నిదా నంగా వాటిని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో పదో న్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు తప్పకుండా ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి.
వృత్తి, ఉద్యోగాలు ఒడిదుడుకులు లేకుండా పురోగతి చెందుతాయి. వ్యాపారాల్లో కూడా సంపాదన నిలకడగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కొంత మేరకు సఫలమవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కుటుంబపరంగా అదనపు బాధ్యతలు మీద పడతాయి. కొత్త ఉద్యోగం విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా కొద్దిపాటి చికాకులు ఉండవచ్చు. కొందరు బంధువులు విమర్శలు చేసే అవకాశం ఉంది. పిల్లల నుంచి సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతానికి కొత్త ప్రయత్నాలు చేపట్టకపోవడం మంచిది. వాహన ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం.
వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థి కంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది.