సెప్టెంబర్ 18 రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు

Horoscope Today (September 18, 2026): శుక్రవారం 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జ్యోతిష్య అంచనాల ప్రకారం మేష రాశివారికి ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి, కుటుంబంలో సంతోషం కలిగే అవకాశం ఉంది. వృషభ రాశివారికి ఉద్యోగం, వృత్తిలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకోవచ్చు. మిథున రాశివారికి ఆర్థిక సమస్యలు తగ్గి, లాభాల పరంగా ఆశించిన పురోగతి కనిపించే అవకాశం ఉంది. మరి మేషం నుంచి మీనం వరకు మిగిలిన రాశుల వారికి శుక్రవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

సెప్టెంబర్ 18 రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు
Rashi Phalalu 18 September 2026

Edited By:

Updated on: Sep 18, 2026 | 6:00 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 18, 2026): మేష రాశి వారికి ఆర్థికంగా అంచనాల్ని మించిన పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో కొత్త పద్ధతులు, ప్రక్రి యలు ప్రవేశపెడతారు.
మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. లాభాలపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు అంది వస్తాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాల వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా అంచనాల్ని మించిన పురోగతి ఉంటుంది. బంధువుల నుంచి శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. తలపెట్టిన కార్యకలాపాలు సజావుగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరు గుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో కొత్త పద్ధతులు, ప్రక్రి యలు ప్రవేశపెడతారు. ప్రయాణాల్లో మంచి పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనుల్ని వేగంగా పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంత బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో విద్యార్థులు రాణిస్తారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. లాభాలపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో లబ్ధి పొందుతారు. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరి ష్కారం అవుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. అలవికాని లక్ష్యాలతో ఇబ్బందిపడడం జరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపో తాయి. ముఖ్యమైన పనులు, కార్యకలాపాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల చదువుల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన కబురు అందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం బాగుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో భారీ లక్ష్యాలు, ప్రాజెక్టులతో సతమతం అవుతారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. కొందరు బంధుమిత్రులు సహాయ సహకారాలు అంద జేస్తారు. ఊహించనిమంచి పరిచయాలు ఏర్పడతాయి. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేయడం, దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధి లోకి వస్తారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బంది లేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. కుటుంబపరంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొందరు సన్నిహితుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రధానమైన కార్యకలాపాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటివి ఆశించిన ఫలితాలనిస్తాయి. బంధుమిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాల్లో బాగా యాక్టివిటీ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చూసే విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం వల్ల లబ్ధి పొందుతారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సమాజంలో విశేషమైన ఆదరణ పొందుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలపరంగా అధిక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, ప్రయత్నాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సమాజంలో పలుకుబడి, గౌరవమర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి పరిచయస్థుల్లో మంచి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

Loading...
Unable to load recommendations.
Follow Us