
దిన ఫలాలు (జూన్ 18, 2026): ఉద్యోగంలో మేష రాశి వారి మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారికి వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం ఉంది. మిథున రాశి వారు ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. డాక్టర్లకు, లాయర్లకు, ఇతర వృత్తులవారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కొత్త ప్రయత్నాలు, ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. సోదర వర్గంతో వివాదాలు పరిష‌్కరించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు.
వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. ఇతరుల మీద ఆధార పడకపోవడం మంచిది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. విదేశాల నుంచి శుభవార్త అందుతుంది.
ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. కొన్ని ముఖ్యమైన వ్యవ హారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో జీవిత భాగస్వామికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది.
ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. సమాజంలో మాట బాగా చెల్లుబాటు అవుతుంది. కొత్త ప్రయత్నాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు బాగా సానుకూలపడతాయి.
ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాల్లో తప్ప కుండా విజయం లభిస్తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో తొందరపాటుతో మాట్లాడి, ఆ తర్వాత ఇబ్బందిపడే సూచనలు కనిపిస్తున్నాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగాలు బాగా సంతృప్తికరంగా సాగిపోతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అనారోగ్య బాధ నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరిగి రుణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అప్రయత్నంగా లాభాలు పెరుగుతాయి. మనసులోకి కోరికలు నెరవేరుతాయి. సంపాదన పెరుగుతుంది కానీ వృథా ఖర్చులు కూడా పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. సోదరులకు అండగా నిలబడతారు. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. మీ పనితీరుతో అధికారుల్ని ఆకట్టుకుంటారు. వ్యాపార లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. పోటీదార్లతో సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. అనుకున్నవి అనుకున్నట్టు జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో, ముఖ్యంగా పిల్లల వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలావరకు కోలుకుంటారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత ఎక్కువవుతుంది. చదువుల్లో పిల్లలకు సహాయం చేస్తారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. బంధుమిత్రుల్లో మీ మాటకు, చేతకు విలువ ఉంటుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కొందరు మిత్రులతో అకారణంగా శత్రుత్వం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది.
వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. మొత్తం మీద ఆదాయం, రాబడి బాగానే ఉంటాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. మిత్రుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్లకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రతిభా పాటవాలకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.