Horoscope Today (15 August): వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Aug 15, 2023 | 5:01 AM

Daily Horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 15, 2023న(మంగళవారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

Horoscope Today (15 August): వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope 15th August 2023
Follow us on

Daily Horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 15, 2023న (మంగళవారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): కుటుంబ సభ్యుల నుంచి శుభ వార్తలు వింటారు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు
తలెత్తే అవ కాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అయితే, తొందర పాటు ఆలోచనలు మంచివి కావు. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యా నికి, ఆదాయానికి ఢోకా ఉండదు కానీ, ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. కొత్త వస్త్రాభరణాలు కొనుగోలు చేసే
అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోయి, లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులను వేగంగా పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలుం టాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. పరిచయస్థుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగ వాతావరణం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంటుంది. కొత్త
ప్రాజెక్టులను చేపట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక సేవా కార్య క్రమాలు నిర్వహిస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహాయ సహకారా లతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు తీసుకోండి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. కొత్త ఉద్యోగావ కాశాలు అంది వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు తనం పనికి రాదు. ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఉద్యోగపరంగా మంచి కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవ కాశం ఉంది. బంధువుల నుంచి విమర్శలు విన వస్తాయి. అదనపు బాధ్యతల వల్ల ఇంటా బయటా ఒత్తిడి పెరిగి, విశ్రాంతి లభించదు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. విందు కార్యక్రమంలో పాల్గొంటారు. దైవ సేవా కార్య క్రమాలకు సహాయం అందిస్తారు. నూతన వస్తు లాభాలకు అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణాలను చాలావరకు తీర్చగలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభించడమే కాకుండా, ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): కొన్ని పరిస్థితులు కలిసి రావడం వల్ల ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను
ప్రవేశపెట్టి లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగు తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. పది మందికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం
అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు. ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది కానీ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒత్తిడి కారణంగా కొన్ని పనులను, ప్రయత్నాలను వాయిదా వేస్తారు. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి
శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): పెళ్లి సంబంధాలకు సంబంధించి బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. దీనివల్ల ఊరట లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. ఖర్చులకు కళ్లెం వేస్తారు. బంధుమిత్రులు మీ సలహాలు పాటించి ప్రయోజనం పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): దాదాపు ప్రతి చిన్న ప్రయత్నమూ సఫలం అవుతుంది. గట్టి పట్టుదలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖుల నుంచి గుర్తింపు, సత్కారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులు కొత్త బాధ్యతలను, కొత్త ప్రాజెక్టు లను అప్పగిస్తారు. తోబుట్టువులతో, కొందరు బంధువులతో వివాదాలు సద్దుమణుగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. దాంపత్యంలో అన్యోన్యత పెరుగు తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): చాలా కాలంగా పెండింగులో ఉన్న ముఖ్యమైన పనులను గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధు వుల నుంచి అందిన శుభవార్త ఒకటి కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. జీవిత భాగ స్వామితో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ కొందరు స్నేహితులకు సహాయం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఎంతో కొంత పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరిని అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. అదనపు మార్గాల ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఏవైనా సమస్యలుంటే కాస్తంత తగ్గుముఖం పడతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి