Telugu News Astrology Chandra grahan 2024: second lunar eclipse have a good zodiac signs impact love life
Lunar Eclipse: ప్రేమ విషయంలో ఆందోళన చెందుతున్నారా.. ఈ చంద్రగ్రహణం ఈ రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుందట..
ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న సంభవించబోతోంది. ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణం. అయితే ఈ చంద్ర గ్రహణం అన్ని రాశులకు చెందిన వ్యక్తులపై భిన్నమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది, ముఖ్యంగా ప్రేమ విషయంలో లేదా దంపతుల మధ్య వివాదాల విషయంలో ఆందోళన చెందుతున్న వారికి ఈ గ్రహణం చాలా అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతున్నారు జ్యోతిష్కులు.
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.. ఎందుకంటే గ్రహణాలు అన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితాల్లో మార్పులను తెస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 25న హోలీ రోజున ఏర్పడింది. ఇక ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న సంభవించబోతోంది. ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణం. అయితే ఈ చంద్ర గ్రహణం అన్ని రాశులకు చెందిన వ్యక్తులపై భిన్నమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది, ముఖ్యంగా ప్రేమ విషయంలో లేదా దంపతుల మధ్య వివాదాల విషయంలో ఆందోళన చెందుతున్న వారికి ఈ గ్రహణం చాలా అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతున్నారు జ్యోతిష్కులు.
చంద్ర గ్రహణ సమయం
ఈసారి భాద్రపద మాసంలోని పౌర్ణమి రోజున సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18 ఉదయం 6:11 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 10:17 గంటలకు ముగుస్తుంది. కనుక రెండో చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. సుతకాలం ఉండదు. అయితే ఈ గ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది.
వృషభ రాశి: ఈ చంద్ర గ్రహణం వృషభ రాశి వారికి శుభసూచకాలను తెస్తుంది. ఈ రాశి వారికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు ఉంటాయి. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తుల ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం కనిపిస్తుంది.
తులారాశి: ఈ ఏడాదిలో చివరి చంద్ర గ్రహణం తుల రాశి వారికి అదృష్టం తీసుకుని వస్తుంది. ఈ రాశి వారికి చంద్ర గ్రహణం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో ఈ రాశి వారికి వివాహాలలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ప్రేమిస్తున్న వారు అయితే పెళ్లి విషయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
వృశ్చికరాశి: వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం చాలా మంచిది. ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో మాత్రమే కాదు ప్రేమ జీవితంలో గొప్ప విజయాన్ని పొందవచ్చు. ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది.
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి