Astro Tips: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ రోజుల్లో వెండి కొంటే చాలా శ్రేయస్కరం .. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..

|

Aug 06, 2023 | 12:25 PM

వాస్తు ప్రకారం వెండిని కొనుగోలు చేయడానికి కొన్ని రోజులు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. వెండి కొనడానికి ఏ రోజు శ్రేయస్కరమో తెలుసుకోండి. పుష్యమి నక్షత్రం అత్యంత పవిత్రమైన రాశుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం, వెండి కొనుగోలుకు చాలా ప్రాముఖ్యత ఉంది.

Astro Tips: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ రోజుల్లో వెండి కొంటే చాలా శ్రేయస్కరం .. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..
Astro Tips
Follow us on

ప్రతి వ్యక్తి జీవితంపై సానుకూల, ప్రతికూల శక్తి ప్రభావం చూపుతుందని వేల సంవత్సరాల నాటి జ్యోతిష్యం నమ్ముతుంది. సానుకూల శక్తి వ్యక్తి విజయానికి మార్గాన్ని తెరుస్తుంది. ఇది శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందాన్ని తెస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం వెండిని కొనుగోలు చేయడానికి కొన్ని రోజులు శుభప్రదం. ఎందుకంటే ఇలా చేయడం వలన సుఖ, సంపదలు ఇంట్లో తెస్తుందని విశ్వాసం. వాస్తు ప్రకారం వెండిని కొనుగోలు చేయడానికి కొన్ని రోజులు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. వెండి కొనడానికి ఏ రోజు శ్రేయస్కరమో తెలుసుకోండి.

పుష్యమి నక్షత్రం: పుష్యమి నక్షత్రం అత్యంత పవిత్రమైన రాశుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం, వెండి కొనుగోలుకు చాలా ప్రాముఖ్యత ఉంది. పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో వెండిని కొనుగోలు చేయడం వల్ల అపారమైన సంపద, ఆర్థికాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు.

గురువారం: గురువారం దేవగురు బృహస్పతికి చెందింది. ఈ రోజు వెండిని కొనుగోలు చేయడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. దేవగురు బృహస్పతి సంపద, శ్రేయస్సుకి సంబంధించిన  గ్రహం అని పిలుస్తారు. గురువారం రోజున వెండి కొనుగోలు చేయడం వలన జీవితంలో ఆర్థిక శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

అక్షయ తృతీయ: అక్షయ తృతీయ, ఏప్రిల్ లేదా మేలో జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగ. వెండిని కొనుగోలు చేయడానికి ఈ రోజు శుభ సందర్భం. ఈ రోజున వెండిని కొనుగోలు చేయడం వలన అంతులేని  ప్రయోజనాలను ఇస్తుందని నమ్ముతారు.

వెండి కొనుగోలుకు సంబంధించిన వాస్తు చిట్కాలు

  1. వెండిని కొనుగోలు చేసేటప్పుడు.. ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉన్న దుకాణం నుంచి కొనుగోలు చేయడానికి  ప్రయత్నించండి. ఈ దిశలో శ్రేయస్సుకు, సానుకూల శక్తితో సంబంధం కలిగి ఉన్నందున వాస్తు శాస్త్రంలో ఈ దిశలు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి.
  2. ఇంటి అలంకరణలో వెండి విగ్రహాలు, షోపీస్ లేదా పాత్రలు వంటి వెండి వస్తువులను చేర్చడం వల్ల సంపద, ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందని నమ్ముతారు.
  3. వెండి సానుకూల శక్తిని చెక్కుచెదరకుండా ఉంచడానికి, వాటిని శుభ్రంగా, మెరిసేలా ఉంచడం అవసరం.  వెండి వస్తువులను తరచుగా శుభ్రం చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పేరుకుపోకుండా ఉంటుంది.
  4. వెండి వస్తువులను ఉపయోగించనప్పుడు సురక్షితంగా, క్రమబద్ధంగా ఉంచండి. అంతేకాదు వెండి వస్తువులను దుమ్ము నుండి రక్షించేలా చూసుకోండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)