ఆర్టికల్ 370 రద్దు: ఎల్‌వోసీ వద్ద హైఅలర్ట్

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సైన్యం మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. పాకిస్తాన్ ఎలాంటి దుస్సహసానికైనా ఒడిగట్టే ప్రమాదం ఉందని అధికార వర్గాలు హెచ్చరించాయి. ఆ దేశం ఎలాంటి చర్యలకు పూనుకున్నా.. వాటిని తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎల్‌వోసీ దగ్గర సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడులు, అల్లర్లు జరిగే అవకాశముందన్న సమాచారంతో […]

ఆర్టికల్ 370 రద్దు: ఎల్‌వోసీ వద్ద హైఅలర్ట్
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2019 | 8:59 AM

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సైన్యం మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. పాకిస్తాన్ ఎలాంటి దుస్సహసానికైనా ఒడిగట్టే ప్రమాదం ఉందని అధికార వర్గాలు హెచ్చరించాయి. ఆ దేశం ఎలాంటి చర్యలకు పూనుకున్నా.. వాటిని తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎల్‌వోసీ దగ్గర సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడులు, అల్లర్లు జరిగే అవకాశముందన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో నిషేదాఙ్ఞలు విధించగా.. భద్రతా బలగాలు భారీగా మోహరించాయి.