భారీగా బంగారం స్మగ్లింగ్.. తెరవెనుక సూత్రధారులు వీరేనా..?

గత కొద్ది రోజుల నుంచి చెన్నైలో భారీగా బంగారం పట్టుబడుతోంది. కోట్లల్లో విలువైన బంగారాన్ని అక్రమంగా తరలించేస్తున్నారు. అయితే.. ఈ బంగారం స్థానికంగా ఉన్న వ్యాపారులే చేస్తున్నారా..? లేక వెనుక నుంచి ఎవరైన నడిపిస్తున్నారా..? అంటే దానికి కూడా పలు విస్తుపోయే నిజాలు దొరికాయి. ముఖ్యంగా.. తమిళనాడులోని మధురై, తిరుచ్చి ఎయిర్‌పోర్టులకు పసిడి అక్రమ రవాణా ఎక్కువగా కొనసాగుతోంది. అక్కడికి మాత్రమే ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారనే ప్రశ్న అందరిలోనూ.. మెదులుతోంది. దీనిపై రెక్కీ నిర్వహించిన పోలీసులకు […]

భారీగా బంగారం స్మగ్లింగ్.. తెరవెనుక సూత్రధారులు వీరేనా..?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 06, 2019 | 5:26 PM

గత కొద్ది రోజుల నుంచి చెన్నైలో భారీగా బంగారం పట్టుబడుతోంది. కోట్లల్లో విలువైన బంగారాన్ని అక్రమంగా తరలించేస్తున్నారు. అయితే.. ఈ బంగారం స్థానికంగా ఉన్న వ్యాపారులే చేస్తున్నారా..? లేక వెనుక నుంచి ఎవరైన నడిపిస్తున్నారా..? అంటే దానికి కూడా పలు విస్తుపోయే నిజాలు దొరికాయి.

ముఖ్యంగా.. తమిళనాడులోని మధురై, తిరుచ్చి ఎయిర్‌పోర్టులకు పసిడి అక్రమ రవాణా ఎక్కువగా కొనసాగుతోంది. అక్కడికి మాత్రమే ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారనే ప్రశ్న అందరిలోనూ.. మెదులుతోంది. దీనిపై రెక్కీ నిర్వహించిన పోలీసులకు పలు ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. బంగారం తరలించడానికి చిన్న ఎయిర్‌పోర్టులను.. స్మగ్మర్లు టార్గెట్‌ చేశారు. పెద్ద విమానాశ్రయాల్లో తనిఖీలు ఎక్కువగా ఉండడం, తరచూ బంగారం పట్టుబడుతుండడంతో చిన్న ఎయిర్ పోర్టుల ద్వారా.. స్మగ్మర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.

తాాజాగా.. అందిన సమాచారం ద్వారా.. ఏకంగా.. 150మంది ద్వారా కొద్దికొద్దిగా బంగారాన్ని తరలిస్తున్నారు. 150మందికి వివిధ ఫ్లైట్లలో టికెట్లు బుక్ చేసి ఒక్కొక్కరికీ కొద్దికొద్దిగా బంగారం ఇచ్చి ఇండియాకు పంపుతున్నారు. తాజాగా.. సింగపూర్, దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 50కేజీల బంగారాన్ని పట్టుకున్న డీఆర్ ఐ అధికారులు. అంతేకాకుండా.. ఈ రోజు ఉదయం రెండున్నర కోట్ల విలువైన బంగారు కడ్డీలను.. విమానం టాయిలెట్లో.. పట్టుకున్న అధికారులు.

అయితే.. అందరూ అనుకుంటున్నట్టు.. చెన్నైలోని అక్రమ రవాణా.. అక్కడికి చేరడం లేదట. సముద్ర మార్గం గుండా.. ఇతర దేశాలకు తరలిస్తున్నారట. ఇప్పటికి ఎనబై మందిని అదుపులోకి తీసుకున్న డీఆర్ ఐ అధికారులు. మలేషియా, దుబాయ్ నుంచి వస్తున్న అన్ని ఫ్లైట్లనుంచి వచ్చే ప్రయాణికులందరినీ తనిఖీ చేస్తున్న డీఆర్ ఐ అధికారులు. తిరుచ్చి ఎయిర్ పోర్టుతో పాటు మధురై ఎయిర్ పోర్టులోనూ కొనసాగుతున్న డీఆర్ ఐ అధికారుల తనిఖీలు.

కాగా.. వివిధ అన్ని దేశాల నుంచి చెన్నైకి విమాన సౌకర్యం ఉంటుంది. అందులోనూ.. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం కూడా. దీంతో.. అక్రమ వ్యాపారులు అడ్డంగా దొచుకునేందుకు పలు ప్లాన్స్ వేస్తున్నారు. చెన్నైలోని మధురై, తిరుచ్చికి అక్రమంగా చేరుకున్న బంగారాన్ని.. రామేశ్వరం రోడ్డు మార్గంగా.. సముద్రం మీదుగా.. శ్రీలంకకు తరలిస్తున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.