సెంటు భూమి లేదా? ఇదిగో చిట్టా : సుజనాపై బొత్స ఫైర్

బీజేపీ రాజ్యసభ సభ్యుడు  సుజనాచౌదరిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతి రాజధానిలో సెంటు భూమి కూడా తనకు లేదని దమ్ముంటే ఆధారాలు చూపించాలంటూ సుజనా తనకు విసిరిన సవాలును తాను స్వీకరిస్తున్నట్లు ఆయన  స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా ఎంపీ సుజనాచౌదరి బంధువులకు సంబంధించి భూముల చిట్టాను విడుదల చేశారు బొత్స. ఎంపీ సుజనా సోదరుడి కుమార్తె పేరు మీద చందర్లపాడు మండలం గుడిమెట్లలో 14 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు […]

సెంటు భూమి లేదా? ఇదిగో చిట్టా : సుజనాపై బొత్స ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 27, 2019 | 6:57 PM

బీజేపీ రాజ్యసభ సభ్యుడు  సుజనాచౌదరిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతి రాజధానిలో సెంటు భూమి కూడా తనకు లేదని దమ్ముంటే ఆధారాలు చూపించాలంటూ సుజనా తనకు విసిరిన సవాలును తాను స్వీకరిస్తున్నట్లు ఆయన  స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా ఎంపీ సుజనాచౌదరి బంధువులకు సంబంధించి భూముల చిట్టాను విడుదల చేశారు బొత్స.

ఎంపీ సుజనా సోదరుడి కుమార్తె పేరు మీద చందర్లపాడు మండలం గుడిమెట్లలో 14 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు మంత్రి. సుజనా చౌదరికి చెందిన ఓ కంపెనీ పేరు మీద 110 ఎకరాలు ఉన్నాయన్నారు. వీరులపాడు మండలం గోకరాజు పాలెంలో ఉన్న ఈ భూములు.. ఎంపీ అల్లుడికి సంబంధించినవని చెప్పుకొచ్చారు. ఇటు చంద్రబాబు బంధువులకు ఎకరా రూ.లక్షకే.. 500కుపైగా ఎకరాలు కట్టబెట్టారని ఆరోపించారు. అక్రమాలు జరిగిన భూముల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచన చేస్తున్నామన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెడతామన్నారు.  తాను చూపించిన ఆధారాలపై సమాధానం చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు.