చంద్రబాబు చెప్పీచెప్పంగానే ఎంటరైపోయిన విజయసాయి, దుకాణం మూసే ముందు డిస్కౌంట్‌ ఆఫర్లంటూ సెటైర్లు

| Edited By: Janardhan Veluru

Apr 03, 2021 | 2:50 PM

Vijayasai reddy reaction on tdp stand on mptc zptc polls : పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ టీడీపీ నిర్ణయించుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ..

చంద్రబాబు చెప్పీచెప్పంగానే ఎంటరైపోయిన విజయసాయి, దుకాణం మూసే ముందు డిస్కౌంట్‌ ఆఫర్లంటూ సెటైర్లు
Follow us on

Vijayasai reddy reaction on tdp stand on mptc zptc polls : పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ టీడీపీ నిర్ణయించుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ఆపార్టీ అధినేత చంద్రబాబు కొంచెం సేపటి క్రితం ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తక్షణమే స్పందించారు. తనదైన శైలిలో ట్విట్టర్‌ వేదికగా సెటైర్లు వేస్తూ ఇలా చెప్పుకొచ్చారు. “వ్యాపారంలో నష్టమొచ్చి దుకాణం మూసే ముందు సరుకులను 90% డిస్కౌంటుకు ఆఫర్ చేస్తుంటారు. దానికి కూడా ఎవరూ ముందుకు రాకపోతే ఫ్రీగా వదిలించుకుంటాడు యజమాని. చంద్రబాబు పరిస్థితి అచ్చం అలాగే ఉంది. ప్రజా క్షేత్రంలో తిరస్కృతిడిగా మిగిలి, పరిషత్ ఎన్నికల్లో పోటీకి భయపడుతున్నాడు.” అంటూ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

ఇలాఉండగా, ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై తెలుగుదేశం ఎవరూ ఊహించని విధంగా ఇవాళ రియాక్ట్ అయింది. త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ప్రకటించారు. అక్రమాలు జరిగిన ఎన్నికలనే కొనసాగిస్తున్నారని…ఎస్ ఈసి తీరును తప్పు పడుతూ ఎన్నికలను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఎస్‌ఈసీ నీలం సాహ్నిని టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మేరకు సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ఎస్‌ఈసీ వచ్చిరాగానే నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నించారు. అసలు ఎన్నికలు పెట్టే అర్హత కొత్త ఎస్‌ఈసీకి ఉందా అని నిలదీశారు. స్థానిక ఎన్నికలు రాజ్యాంగ బద్ధంగా జరగలేదని తప్పుబట్టారు. ఎన్నికలకు ముందే సీఎం, మంత్రులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని, నిబంధనలు పక్కనపెట్టి ఎన్నికలు జరుపుతున్నారని దుయ్యబట్టారు.

Read also : పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది. మనకి మాత్రం ముగిసిన అధ్యాయం అంటూ కబుర్లు చెబుతోంది : మంత్రి పేర్ని