YSR Sunna Vaddi scheme: రైతుల ఖాతాల్లోకి వడ్డీ రాయితీ సొమ్ము.. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేసిన సీఎం జగన్

ఎన్నికల సందర్భంగా చేసిన నవ రత్నాల హామీల అమలులో భాగంగా.. ఆరు లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీ అందించామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

YSR Sunna Vaddi scheme: రైతుల ఖాతాల్లోకి వడ్డీ రాయితీ సొమ్ము.. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేసిన సీఎం జగన్
Ap Cm Ys Jagan Released Ysr Sunna Vaddi Scheme

Updated on: Apr 20, 2021 | 1:40 PM

అన్నదాతలకు ఇచ్చిన వాగ్దానాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. ఎన్నికల సందర్భంగా చేసిన నవ రత్నాల హామీల అమలులో భాగంగా.. ఆరు లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీ అందించామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రూ.128.47 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. 2019 20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం వడ్డీ రాయితీ‌ వారి ఖాతాలో జమ చేశారు.

వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రైతులు, రైతు కూలీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న జగన్.. ప్రపంచంలో 60శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారన్నారు. గత ప్రభుత్వం బకాయిలను కూడా తామే చెల్లించామని చెప్పారు. రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని, రైతు భరోసా కేంద్రాలతో ఎంతో మేలు జరుగుతోందని చెప్పారు. వచ్చే నెలలో మరో విడత రైతు భరోసా సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్‌‌ స్పష్టం చేశారు. ఇక లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ పథకం ద్వారా ఇప్పటివరకు రైతులకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది. రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు.. సీఎం జగన్ వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు. తొలుత ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. అయితే, ఈ క్రాప్‌లో 2,50,550 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇప్పుడు సీఎం జగన్‌ ఉదారంగా ఈ పథకాన్ని వర్తింజేసి వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు.

Read Also…  రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు : Telangana Night Curfew Vide