YSR Pension Kanuka: పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ.. 2.66 లక్షల మంది వాలంటీర్ల ఏర్పాటు

|

Apr 01, 2022 | 8:48 AM

YSR Pension Kanuka: ఏపీలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61 లక్షల మంది లబ్దిదారులకు పెన్షన్‌లను పంపిణీ చేయనుంది. ఈ పంపిణీ..

YSR Pension Kanuka: పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ.. 2.66 లక్షల మంది వాలంటీర్ల ఏర్పాటు
Ysr Pension Kanuka
Follow us on

YSR Pension Kanuka: ఏపీలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61 లక్షల మంది లబ్దిదారులకు పెన్షన్‌లను పంపిణీ చేయనుంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్‌ 1న నేరుగా లబ్దిదారుల ఇంటి వద్ద, వారి చేతికి అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (Cm YS Jagan) సంకల్పించినట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) తెలిపారు. ఈ పంపిణీ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అయితే ఏప్రిల్‌ 1న తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు పెన్షణ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1551.16 కోట్లు ఇప్పటికే విడుదల చేయగా, ఈ మొత్తాలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ పెన్షన్ల పంపిణీ కోసం 2.66 లక్షల మంది వాలంటీర్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

అయితే పెన్షన్లను పంపిణీ చేసే సమయంలో లబ్దిదారులను గుర్తించేందుకు బయోమెట్రిక్‌తో పాటు ఐరిస్‌, ఆర్బీఐఎస్‌ విధానాన్ని కూడా వినియోగిస్తారన్నారు. మొత్తం పెన్షన్ల పంపిణీ ఐదు రోజుల్లో వందశాతం పూర్తయ్యేలా ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 15వేల మంది వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, వార్డు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్యదర్శులు భాగస్వామ్యం అవుతారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

Tallibidda Express: బెజవాడ నుంచి ‘తల్లీబిడ్డ ఎక్స్​ప్రెస్’ సేవలు ప్రారంభించనున్న సీఎం జగన్

Ugadi Holiday: ఉగాదికి సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు