Balineni Srinivasa Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు..!

వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సొంత పార్టీలోనే ఇబ్బందులు పడ్డానని చెప్పారు. కొందరు తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో తాను అన్నింటినీ ఓర్చుకున్నానని చెప్పారు.

Balineni Srinivasa Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు..!
Balineni Srinivasa Reddy

Updated on: Jul 16, 2024 | 1:54 PM

వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సొంత పార్టీలోనే ఇబ్బందులు పడ్డానని చెప్పారు. కొందరు తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో తాను అన్నింటినీ ఓర్చుకున్నానని చెప్పారు. తాను హవాలా చేశానని, భూకబ్జాలు చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని… తనపై వస్తున్న అన్ని ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను కోరుతున్నానన్నారు.

తనను భయపెడితే భయపడే వాణ్ణికాదని, తాను మంచితనానికి లొంగుతానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి అన్నారు. తనపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వైసీపీలోనే అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ఏం జరిగిందో ప్రజలకు వివరిస్తానన్నారు. అన్ని రకాలుగా తనను వైసీపీ నేతలతో కలిసి టీడీపీ నేతలు ఇబ్బందులకు గురిచేశారన్నారు. తాను ప్రజల్లోకి త్వరలోనే వెళ్ళనున్నట్టు ప్రకటించారు. తాను అన్నింటికి సిద్దంగానే ఉన్నానన్నారు. ఒంగోలులో తాను అవినీతికి పాల్పడినట్టు అనిపిస్తే వెంటనే విచారణ చేయించుకోవచ్చని బాలినేని అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us