తొంభై ఆరేళ్ల వయస్సులో..  ఇరవై ఏళ్ల యువతకు స్ఫూర్తిగా నిలిచిన మహిళ ప్రొఫెసర్.. సూపర్ కదా?

శాంతమ్మ పని చేస్తున్న సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజు కూడా తన శిష్యుడే. అంతేకాదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి వారు ఎందరో  శాంతమ్మ  శిష్యులుగా ఉన్నారు. ఆమె కుటుంబం కూడా సమాజానికి ఎన్నో సేవలు అందించింది. ఆమె భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి కూడా అధ్యాపకుడిగా పనిచేశారు. జాతీయస్థాయిలో కీలక ఆర్గనైజేషన్ అయిన ఆర్ ఎస్ ఎస్ లో మూడు రాష్ట్రాలకు సంఘ్ చాలక్ గా పనిచేసి అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మరణం తరువాత

తొంభై ఆరేళ్ల వయస్సులో..  ఇరవై ఏళ్ల యువతకు స్ఫూర్తిగా నిలిచిన మహిళ ప్రొఫెసర్.. సూపర్ కదా?
Professor Chilukuri Santham
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 17, 2024 | 7:11 PM

వయస్సుకు వృద్ధాప్యం కానీ మనస్సుకి కాదని నిరూపించారు తొంభై ఆరేళ్ల మహిళ ప్రొఫెసర్. యంగ్ ఏజ్ లోనే ఏమి చేయలేమని నిరాశ నిస్పృహలతో ఇంటికే పరిమితమవుతున్న ఈ రోజుల్లో వయోభారంతో నడవలేని స్థితిలో కూడా మానసిక దృఢత్వంతో ఆమె సేవలు అందరికీ అందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారా.. ఇంతకీ ఎవరా మహిళ? ఆమె ఎక్కడుంటారు? ఏం చేస్తున్నారనే సందేహంలో ఉన్నారు కదా..? ఆమె ఒక మహిళ ప్రొఫెసర్.. తన గురించి తెలియాలంటే..ఆమె స్ఫూర్తిదాయకమైన స్టోరీ పూర్తిగా చదవాల్సిందే..

ఆ మహిళ పేరు శాంతమ్మ. వయసు ప్రస్తుతం 96 ఏళ్లు. 1951లో ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యారు. ఆ తరువాత సుమారు నాలుగు దశాబ్దాల పాటు విజయవంతంగా ఆమె తన సేవలు అందించారు. 1989లో పదవీ విరమణ పొందిన శాంతమ్మ అదే ఆంధ్ర యూనివర్శిటీలో కొన్నేళ్ల పాటు గౌరవ అధ్యాపకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలోని సెంచూరియన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫిజిక్స్ ఆప్టిక్స్ సబ్జెక్టును విద్యాబోధన చేస్తున్నారు.

శాంతమ్మ విశాఖపట్నంలో నివాసం ఉంటారు. ఈమెకు జీతభత్యాల పై అంతగా ఆపేక్ష ఉండదు. కానీ, తనకు ఉన్న నాలెడ్జ్, తాను తెలుసుకున్న అంశాలు పదిమందికి అందించాలనే తపన ఆమెను నడిపిస్తుంటుంది. అందులో భాగంగానే విశాఖపట్నం నుండి సుమారు 140 కిలోమీటర్ల మేర ప్రతిరోజు ప్రయాణించి విజయనగరంలో విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలో లేని కొత్త కొత్త విషయాలను తెలియజేస్తారు. విద్యాబోధనలోనే కాకుండా విధ్యార్ధులతో కలిసి నవ్వుతూ నవ్విస్తూ సరదాగా గడుపుతారు.

ఇవి కూడా చదవండి

ఆమె యూనివర్శిటీలో ఆధ్యాపకురాలిగానే కాకుండా అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియాలోని అనేక యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు  శాంతమ్మ 17 మందికి హెచ్ డి పట్టాలు, నలుగురికి ఎంపిల్ పట్టాలు అందజేశారు. ఈ వయస్సులో కూడా ఈమె అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేటి యువత కోసం కొత్త విషయాలతో కూడిన రెండు పుస్తకాలు రాస్తున్నారు.

శాంతమ్మ పని చేస్తున్న సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజు కూడా తన శిష్యుడే. అంతేకాదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి వారు ఎందరో  శాంతమ్మ  శిష్యులుగా ఉన్నారు. ఆమె కుటుంబం కూడా సమాజానికి ఎన్నో సేవలు అందించింది. ఆమె భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి కూడా అధ్యాపకుడిగా పనిచేశారు. జాతీయస్థాయిలో కీలక ఆర్గనైజేషన్ అయిన ఆర్ ఎస్ ఎస్ లో మూడు రాష్ట్రాలకు సంఘ్ చాలక్ గా పనిచేసి అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మరణం తరువాత ఆమెకు విశాఖ వాల్తేరులో ఉన్న సొంత ఇంటిని వివేకానంద మెడికల్ ట్రస్ట్ కు ఇచ్చి ఆమె వేరే ప్రాంతానికి వెళ్లిన గొప్ప మానవతావాది ప్రొఫెసర్ శాంతమ్మ. ఆమె ఇలాగే ఆరోగ్యంగా ఉండి మరిన్ని కొత్తకొత్త విషయాలు సమాజానికి అందిస్తూ భావిభారత యువతకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నారు విద్యార్థులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అలా సంధ్యాసమయంలో.. పురి విప్పిన నెమలి నాట్యం.. ఎద్దులతో కలిసి ఇలా
అలా సంధ్యాసమయంలో.. పురి విప్పిన నెమలి నాట్యం.. ఎద్దులతో కలిసి ఇలా
ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌, ఏకంగా రూ. 20 వేలకిపైగా
ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌, ఏకంగా రూ. 20 వేలకిపైగా
Shubh Yoga: వృషభ రాశిలో గురువు.. ఆ రాశుల వారికి శుభ యోగాలు పక్కా.
Shubh Yoga: వృషభ రాశిలో గురువు.. ఆ రాశుల వారికి శుభ యోగాలు పక్కా.
ఈ 5గురి ప్లేయర్లకు కావ్య మారన్ పింక్ స్లిప్.. రిటైన్ లిస్టు ఇదే!
ఈ 5గురి ప్లేయర్లకు కావ్య మారన్ పింక్ స్లిప్.. రిటైన్ లిస్టు ఇదే!
అంబానీయా మజాకా-కొడుకు పెళ్లిలో ఇన్ని రకాల వంటలా? వీడియో వైరల్
అంబానీయా మజాకా-కొడుకు పెళ్లిలో ఇన్ని రకాల వంటలా? వీడియో వైరల్
వంట గదిలో ఇవి ఉండకూడదు.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..
వంట గదిలో ఇవి ఉండకూడదు.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..
ఆ రాశుల వారికి మహా శక్తి యోగం.. పట్టుదలతో సమస్యలను జయిస్తారు..!
ఆ రాశుల వారికి మహా శక్తి యోగం.. పట్టుదలతో సమస్యలను జయిస్తారు..!
తెలుగు ఇండియన్ ఐడల్ 3 స్టేజ్ పై ఫోక్ సింగర్‏కు తమన్ క్రేజీ ఛాన్స్
తెలుగు ఇండియన్ ఐడల్ 3 స్టేజ్ పై ఫోక్ సింగర్‏కు తమన్ క్రేజీ ఛాన్స్
తొంభై ఆరేళ్ల వయస్సులో..  ఇరవై ఏళ్ల యువతకు స్ఫూర్తిగా నిలిచిన మహిళ
తొంభై ఆరేళ్ల వయస్సులో..  ఇరవై ఏళ్ల యువతకు స్ఫూర్తిగా నిలిచిన మహిళ
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.