Andhra: ప్రియుడితో కలిసి పాపం చేసిన పవిత్ర.. కట్ చేస్తే, జీవిత ఖైదు.. అసలేం జరిగిందంటే..

చిత్తూరు జిల్లా రామకుప్పంలో జరిగిన చిన్నారుల దారుణ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కారణంతో ఇద్దరు కన్న కొడుకులను హత్య చేసిన తల్లి పవిత్రకు జీవిత ఖైదు విధించింది. 2017లో జరిగిన ఈ ఘటనలో, తన ప్రియుడు వేమన్నతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలనే ఉద్దేశంతో పవిత్ర తన 6 ఏళ్ల, 3 ఏళ్ల పిల్లలను ఉరి వేసి చంపినట్లు విచారణలో తేలింది.

Andhra: ప్రియుడితో కలిసి పాపం చేసిన పవిత్ర.. కట్ చేస్తే, జీవిత ఖైదు.. అసలేం జరిగిందంటే..
Crime News

Edited By:

Updated on: May 27, 2026 | 9:12 AM

చిత్తూరు జిల్లా రామకుప్పంలో కసాయి తల్లికి కఠినమైన శిక్షనే పడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న ఇద్దరు కన్న కొడుకులను చంపిన తల్లికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2017 సెప్టెంబర్ 9న రామకుప్పం మండలం కవ్వంపల్లిలో జరిగిన ఘటనకు 9 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 6 ఏళ్లు, 3 ఏళ్ల ఇద్దరు కొడుకులను హత్య చేసిన తల్లి పవిత్ర జీవిత ఖైదుగా మారింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కవ్వంపల్లికి చెందిన సి.వేమారెడ్డి, సి.పవిత్ర దంపతులకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేమారెడ్డి ఇంటి లో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న వేమన్నతో పవిత్ర సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో పవిత్ర ట్రాక్టర్ డ్రైవర్ వేమన్న మధ్య రిలేషన్‌షిప్ ఏర్పడింది. ఇద్దరి మధ్య బంధం విడదీయరానిదిగా మారింది. పవిత్ర వేమన్నతో కలిసి ఉండాలని భావించింది. ఇంటిని విడిచి ట్రాక్టర్ డ్రైవర్ వేమన్న వెంట తిరుమలకు వెళ్ళిపోయిన పవిత్రను తిరిగి ఇంటికి పిలిపించిన పెద్దలు సర్ది చెప్పి అప్పట్లో పంచాయితీ చేశారు. సంసారంలో సర్దుకుపోవాలని చెప్పారు. దీంతో పవిత్ర భర్త ఇంటికి చేరగా ప్రియుడు వేమన్న బెంగుళూరుకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయాడు.

అప్పుడప్పుడు కవ్వంపల్లికి వస్తున్న వేమన్నతో పవిత్ర కలుస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే పవిత్ర ఇద్దరు పిల్లలు వేమన్న తో రిలేషన్షిప్ కంటిన్యూ చేసేందుకు అడ్డుగా ఉన్నారని బావించింది. ఇద్దరు పిల్లలను చంపేసి వేరే జీవితం మొదలు పెట్టాలని అనుకొని ప్లాన్ చేసి అమలు చేసారు. ఇద్దరూ కలిసి దారుణానికి ఒడిగట్టారు. ఈ మేరకు 2017 సెప్టెంబర్ 9న అంగన్వాడీ సెంటర్ లో ఉన్న ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకొచ్చారు. ఈ మేరకు పవిత్ర తన ఇద్దరు పిల్లల గొంతుకు నైలాన్ తాడును బిగించి ఫ్యాన్ కి ఉరి వేసి అతి దారుణంగా చంపేసింది. అనంతరం చనిపోయిన ఇద్దరు పిల్లలను మంచం మీద ఉంచి ఇంటిలో ఉన్న రూ. 3వేలు తీసుకుని వేమన్న వెంట పవిత్ర వెళ్లిపోయింది.

ఇంటికి వచ్చిన పవిత్ర భర్త వేమారెడ్డి ఇంటిలోని ఒక రూమ్ లో విగత జీవులై పడిఉండడంతో రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న అప్పటి రామకుప్పం ఎస్.ఐ సురేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రైమ్ నెంబర్ 45/2017 U/Sec 174 CRPC కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగం గానే 2017 సెప్టెంబర్ 13న రామకుప్పం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన పవిత్ర, వేమన్న లు నేరాన్ని అంగీకరించారు. 174 CRPC కింద నమోదు చేసిన కేసును 302 r/w 34 IPC, Sec. 109 and 120 (b) IPC కింద మార్చారు. అప్పటి కుప్పం ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా కేసు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. అప్పట్లో అరెస్ట్ అయి రిమాండ్ కు వెళ్లిన పవిత్ర, వేమన్న కేసులో ఎట్టకేలకు దాదాపు 9 ఏళ్ల తర్వాత తీర్పు వెళ్లడైంది.

మంగళవారం చిత్తూరు జిల్లా 9వ అదనపు కోర్టు కేసు విచారణ ముగించి తీర్పును ప్రకటించింది. సొంత కొడుకులను హత్య చేసిన నేరాన్ని ఆధారాలతో రుజువు చేయడంతో కేసులో A1గా ఉన్న సి.పవిత్ర కు జీవితకాల కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానాను కోర్టు విధించింది. జరిమానా కట్టలేని పక్షంలో మరో మూడు నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని తీర్పును వెలువరించింది. ఈ కేసులో A2 గా వేమ్మన్నను నిర్దోషి గా తేల్చింది. విడుదల చేయాలని న్యామముర్తి తీర్పునివ్వడంతో 25 ఏళ్ల పవిత్ర జైలు పాలైంది.

కేసులో ముద్దాయికి శిక్ష పడటంలో కృషి చేసిన అప్పటి రామకుప్పం ఎస్.ఐ. సురేష్ బాబు, కుప్పం ఇన్స్పెక్టర్ ఎం.రాజశేఖర్, అడిషనల్ పి.పి శరవణ కుమార్, కోర్టుకు సాక్షాలను సకాలంలో హాజరు పరచిన కోర్ట్ కానిస్టేబుల్ కార్తీక, ఖాదర్, కోర్టు మానిటరింగ్ సెల్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ మనోహర్ లను చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us