వేసవి సీజన్(Summer Season) ప్రారంభం కావడంతో పెళ్లి కళ వచ్చేసింది. గత రెండేళ్లుగా కరోనా(Corona) తో శుభకార్యాలు, వివాహాలు కళ తప్పాయి. ఫలితంగా ఈ ఎండాకాలం సీజన్ లో భారీగా ముహుర్తాలు ఉన్నాయి. శుభకృత్ నామ సంవత్సరంలో అధిక సంఖ్యలో వేడుకలు జరగనున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అధిక సంఖ్యలో ముహూర్తాలు ఉన్నట్లు పంతుళ్లు చెబుతున్నారు. ఏప్రిల్ లో 13, 14, 15, 16, 17, 21, 22, 24, మే నెలలో 3, 4, 12, 13, 14, 15, 18, 20, 21, 22, 25, జూన్ నెలలో 1, 3, 5, 8, 9, 10, 15, 16, 17, 18, 19, 22, 23 తేదీల్లో శుభకార్యాలు అధికంగా ఉన్నాయి. అంతే కాకుండా ఒకే రోజు నాలుగైదు వేడుకలు(Celebrations) ఉండడం విశేషం. ఇప్పటికే కల్యాణ మండపాలన్నీ బుక్ అయ్యాయి. రానున్న మూడు నెలల్లో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నట్లు పురోహితులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లోని ఫంక్షన్ హాళ్లలో రోజుకు రెండు చొప్పున శుభకార్యాలకు బుక్ అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల ద్వారా చాలా మందికి ఉపాధి లభిస్తుంది. డిజైన్లలో పెళ్లి పత్రికల తయారీ, నూతన వస్త్రాల కొనుగోలు, ఫంక్షన్ హాల్, పురోహితులు, ఫొటో, వీడియోగ్రాఫర్లు, డెకరేషన్, టెంట్ హౌస్ నిర్వాహకులు, దర్జీలు, బ్యాండ్, మేకప్, బంగారం వ్యాపారులు, ఇలా ఎన్నో రంగాల వారికి శుభకార్యాలతో ఉపాధి దొరుకుతుంది.
పంచాంగాన్ని బట్టి ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివాహాది శుభకార్యాలు జరగనున్నాయి. ఈ నెల 13 నుంచి జూన్ 23వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లంటే సందడి.. వివిధ రంగాల వారికి ఉపాధినిచ్చే పండగ. మరోవైపు.. చాలా చోట్ల భజంత్రీలకు డిమాండ్ పెరిగింది. దక్షిణ సన్నాయి మేళం కనీసం రూ.18 వేలు చెల్లిస్తేనే వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పెద్దపెద్ద బ్యాండ్ బాజాలు రూ. 60 వేలు దాటి వసూలు చేస్తున్నాయి. వంట మాస్టార్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సౌండ్ సప్లయర్స్, డీజేలకూ మంచి గిరాకీ ఉంది. గత రెండేళ్లుగా నష్టాలు చవిచూసిన వీరంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
Also Read
Sreemukhi: చీరలో బుల్లితెర బ్యూటీ అందాలు చూడతరమా.. అదిరిన శ్రీముఖి లేటెస్ట్ పిక్స్..
viral video: పైథాన్ తోక పట్టుకుని ఆటలు.. కింగ్ కోబ్రా తలపై ముద్దులు.. షాకింగ్ వీడియోలు!
IPL 2022: బెంగళూర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. తర్వాతి మ్యాచ్‌లకు దూరమైన కీలక బౌలర్.. ఎందుకంటే?