AP Weather: ఏపీలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయా..? వాతావరణ శాఖ క్లారిటీ ఇదిగో

|

Dec 15, 2022 | 3:20 PM

ఆంధ్రకు మరో అల్పపీడనం ముప్పు ఉంది.. వర్షాలు దంచికొట్టనున్నాయ్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై వెదర్ డిపార్ట్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది.

AP Weather: ఏపీలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయా..? వాతావరణ శాఖ క్లారిటీ ఇదిగో
Andhra Pradesh Weather Update
Follow us on

ఏపీకి వాన టెన్షన్ వీడిందా..?. ఇటీవల మాండూస్ తుఫాన్ రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను రఫ్పాడించింది. పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. ఇప్పుడు మరోసారి రాష్ట్రంపై మరోసారి వరుణుడు దండెత్తనున్నాడంటూ  వస్తున్న వార్తలపై అమరావతి వాతావరణ కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య /ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని తెలిపింది.  ఆగ్నేయ బంగాళాఖాతం & ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మీద ఉన్న అల్పపీడన ప్రాంతం కొనసాగుతున్నది. ఇది క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ తదుపరి 12 గంటలలో అదే ప్రాంతం మీద తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత ఇది క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ 17 డిసెంబర్ ఉదయానికి దక్షిణ బంగాళాఖాతంలో దాని తీవ్రత కొనసాగిస్తుంది. అయితే దీని ప్రభావం ఏపీపై ఉండదని.. వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని వెదర్ రిపార్ట్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–

ఈరోజు, రేపు మరియు ఎల్లుండి :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

 

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

ఈరోజు, రేపు మరియు ఎల్లుండి :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ :-

ఈరోజు, రేపు మరియు ఎల్లుండి :-  పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

 

ఏపీ వెదర్‌మ్యాన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. వచ్చే 5 రోజుల పాటు ఏపీలో ఎలాంటి వర్షాలు ఉండవని స్పష్టం చేశారు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ నమ్మొద్దని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..