Ap Weather Alert: ఆగ్నేయ బంగాళాఖాతం నుండి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు నిన్న ‘ఉపరితల ద్రోణి’ ఏర్పడింది. అది ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతం యొక్క మధ్యప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి తమిళనాడు తీరప్రాంతాల వరకు.. సగటు సముద్రమట్టానికి 3.1 km వరకు విస్తరించి కొనసాగుతుంది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ వివిధ ప్రాంతాల్లో ఇలా ఉంటాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర ,యానాం :
దక్షిణ కోస్తా ఆంధ్ర :
*ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
*రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
*ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
*రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
*ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
Also Read: Viral Video: జ్యూస్‌లు, వంటల చేస్తున్న పిల్లి.. ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్..