
విజయనగరం, నవంబర్ 4: చలికాలం సమీపిస్తుండటంతో వెచ్చదనం కోసం పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ప్రమాదం ఏ క్షణమైనా పొంచి ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజాగా విజయనగరం రాజాం డోలపేటలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఓ పాము కాటు వేసింది. ట్యూషన్‌కి వెళ్లిన బాలుడి సైకిల్ లో చొరబడ్డ రక్త పింజరి పాము.. అందులో నక్కింది. ట్యూషన్ అనంతరం బయటకు వచ్చిన బాలుడు సైకిల్ ఎక్కగానే పాము కాలుకు చుట్టుకుంది.
దీంతో భయపడిన బాలుడు పాము నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహంతో పాము బాలుడి కాలుపై కాటేసింది. వెంటనే కుటుంబ సభ్యులు రాజాం ఏరియా ఆసుపత్రికి పిల్లాడని తరలించారు. అక్కడి వైద్యులు సకాలంలో వైద్యం అందించడంలో ప్రాణాపాయం తప్పింది. ఇక బాలుడిని కాటు వేసిన పామును స్థానికులు చంపి అవతల పారేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ కథనాల కోసం క్లిక్ చేయండి.