Watch Video: నీళ్లలో దూకిన మహిళ.. ప్రాణాలకు తెలగించి ఎలా కాపాడాడంటే..

ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన మహిళను కాపాడాడు ఒక ఆలయ అర్చకుడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం తుమ్మల పాలెం గ్రామానికి చెందిన మహిళ ఇబ్రహీంపట్నంలోని విటిపిఎస్ కెనాల్‎లో దూకి ఆత్మ హత్యాయత్నం చేశారు.

Watch Video: నీళ్లలో దూకిన మహిళ.. ప్రాణాలకు తెలగించి ఎలా కాపాడాడంటే..
Ntr District

Updated on: May 15, 2024 | 11:30 AM

ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన మహిళను కాపాడాడు ఒక ఆలయ అర్చకుడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం తుమ్మల పాలెం గ్రామానికి చెందిన మహిళ ఇబ్రహీంపట్నంలోని విటిపిఎస్ కెనాల్‎లో దూకి ఆత్మ హత్యాయత్నం చేశారు. అయితే అటుగా వెళ్తున్న అదే ప్రాంతానికి చెందిన ఆంజనేయ స్వామి ఆలయం ప్రధాన అర్చకుడు రవిదత్తా మహిళ కాలువలో దూకడం గమనించాడు. క్షణం ఆలస్యం చేయకుండా కాపాడేందుకు ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తోన్న కాలువలో దూకాడు.

ఆమెను పట్టుకుని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడాడు. ఒడ్డుకు చేర్చిన మహిళ అప్పటికే స్పృహ కోల్పోయి పడిపోయింది. వెంటనే పోలీసులకు, 108 సిబ్బందికి ఫోన్ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసం చేసిన అర్చకుడు రవిదత్తాను స్థానికులు ప్రశంసించారు. అయితే ప్రాణాలతో ఒడ్డుకు చేర్చిన మహిళ ఆరోగ్యం పరిస్థితి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఆమె ఆత్మహత్యకు పాల్పడేందుకు గల కారణాలు తెలుసుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us