Andhra Pradesh: ఓ భారీ రక్త పింజరంను స్నేక్ క్యాచర్ చాలా చాకచక్యంగా పట్టుకున్నాడు. కోనసీమ( konaseema) జిల్లా ముమ్మిడివరం(mummidivaram)లో గత కొద్ది రోజులుగా ఓ రక్త పింజరం పాము హల్‌చల్ చేస్తోంది. అయితే దానిని పట్టుకునేందుకు స్థానిక ప్రజలు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దీంతో స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు స్థానిక ప్రజలు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న అతడు.. గాలిదేవర సత్యనారాయణ ఇంటి ఆవరణలో తిరుగుతున్న పామును పట్టుకునేందుకు రెండు గంటల పాటు శ్రమించాడు. ఓ డబ్బాలో పామును బంధించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కాటు వేసేందుకు రెండుమూడు సార్లు ప్రయత్నించింది. కానీ అతడు చాకచక్యంగా తప్పించుకోని చివరకు పామును డబ్బాలో బంధించి, అటవీ ప్రాంతంలో వదిలేశాడు. అయితే రాత్రి సమయంలో కరెంట్ లేకపోవడంతో, ఇళ్లలోకి పాములు చేరి తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు.
ప్రపంచంలోనే అత్యంత విషమైన పాముల్లో రక్తపింజర ఒకటి. అన్ని పాముల మాదిరిగా గుడ్లు పెట్టడం కాకుండా విభిన్నంగా పిల్లలను కనడం ఈ పాము మరో ప్రత్యేకత. కొన్నిసార్లు వందల సంఖ్యలో పిల్లలను పెడుతుంది.
Also Read: మరోసారి వాయింపు.. టికెట్ ఛార్జీలు పెంచిన TSRTC.. నేటి నుంచే అమల్లోకి