
కామారెడ్డి జిల్లా 44వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గరుఢ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గరుఢ బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. బస్సు, లారీ ఢీ కొనడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న లారీ, బస్సును క్రేన్ సహాయంతో పక్కకు లాగి ట్రాఫిక్ క్లియర్ చేశారు.