‘అంతర్వేది’లో తాత్కాలికంగా దర్శనాలు నిలిపివేత

| Edited By:

Sep 14, 2020 | 4:33 PM

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రఖ్యాత అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దర్శనాలకు బ్రేక్ పడింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 20వరకు ఈ ఆలయంలో

అంతర్వేదిలో తాత్కాలికంగా దర్శనాలు నిలిపివేత
Follow us on

Antarvedi Darshan stopped:తూర్పుగోదావరి జిల్లాలోని ప్రఖ్యాత అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దర్శనాలకు బ్రేక్ పడింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 20వరకు ఈ ఆలయంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. అంతర్వేది, చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. స్వామివారికి నిత్య కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించనున్నామని, అందుకు భక్తులు సహకరించాలని కోరారు.

అయితే ఇటీవల ఆలయంలోని 60ఏళ్ల నాటి రథం దగ్ధమైన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇటీవల కొంతమంది నిరసన తెలిపేందుకు కొంతమంది వెళ్లగా.. వారిలో 36మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరికి కరోనా నిర్ధారణ కాగా.. వారిని అరెస్ట్ చేసిన పోలీసుల్లోనూ పలువురు ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం వారందరు చికిత్స తీసుకుంటున్నారు.

Read More:

పవన్‌-బాలయ్య ఫొటో షేర్ చేసిన నాగబాబు.. ఆసక్తికర కామెంట్‌

బాలయ్య సినిమాలో అల్లరి నరేష్..!