Minister sentiment Kadiyam: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కడియం దొరికేసింది. జనాల తాకిడితో ఆయన కడియం వివాహ వేదిక మీద పడిపోగా.. ఆ తరువాత ఆయన అనుచరులకు ఆ కడియం దొరికింది. తరువాత దాన్ని మంత్రికి అప్పగించగా.. ఆయన హ్యాపీగా ఫీలయ్యారు.
అయితే శ్రీనివాస్ గౌడ్, గురువారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన చాలామంది మంత్రితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. షేక్ హ్యాండ్‌లు ఇచ్చేందుకు కూడా పోటీ పడ్డారు. ఆ గందరగోళంలో ఆయన కడియం మిస్ అయ్యింది. దీంతో ఎవరో తీసేశారని భావించిన మంత్రి, తన కడియం తిరిగిచ్చిన వారికి రూ.లక్ష బహుమానం ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లోపే ఆయన కడియం లభించడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఆ కడియాన్ని శ్రీనివాస్ గౌడ్ సెంటిమెంట్‌గా భావిస్తారని సన్నిహితులు చెబుతున్నారు.