హైదరాబాద్‌ టు విజయవాడకు హైస్పీడ్ రైలు: మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు హైస్పీడ్‌ రైలు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ..

హైదరాబాద్‌ టు విజయవాడకు హైస్పీడ్ రైలు: మంత్రి కేటీఆర్

Updated on: Jun 29, 2020 | 2:39 PM

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు హైస్పీడ్‌ రైలు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ గొప్ప మెట్రోపాలిటన్ నగరమని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి పేర్కొన్నారు. పాలనను ప్రజల ముంగిటకు తెస్తూ సీఎం కేసీఆర్‌ పరిపాలనలో సంస్కరణలకు తెరలేపారని కేటీఆర్‌ వివరించారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని ఆయన తెలిపారు. హుజూర్‌నగర్‌లో సిల్క్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. కరోనాతో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇలాంటి కష్టకాలంలోనూ రైతులకు రైతు బంధు కింద కేసీఆర్ సాయం చేశారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 54 లక్షల 22 వేల రైతులకు 7 వేల కోట్లను రైతు బంధు కింద విడుదల చేసినట్లు వివరించారు. పార్టీలకు అతీతంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని.. తమ ముందున్న లక్ష్యం అభివృద్ధి మాత్రమేనని కేటీఆర్ తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us