GATE 2027 అప్లికేషన్‌ డెడ్‌లైన్‌ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5లోగా దరఖాస్తు చేసుకోండి

GATE 2027కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ముఖ్య అలర్ట్‌. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు అక్టోబర్‌ 5, 2026 చివరి తేదీ. ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తున్న ఈ పరీక్షకు ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, సైన్స్‌ తదితర విభాగాల్లో డిగ్రీ మూడో సంవత్సరం లేదా అంతకంటే పై స్థాయిలో చదువుతున్నవారు, డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. ఈసారి కొత్తగా రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ పేపర్‌ను ప్రవేశపెట్టారు..

GATE 2027 అప్లికేషన్‌ డెడ్‌లైన్‌ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5లోగా దరఖాస్తు చేసుకోండి
GATE Registration Last Date

Updated on: Oct 03, 2026 | 11:01 AM

దేశంలోని ఐఐటీలు, ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE 2027)కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అలర్ట్.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు అక్టోబర్‌ 5, 2026 చివరి తేదీ. ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తున్న ఈ పరీక్షకు ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, సైన్స్‌ తదితర విభాగాల్లో డిగ్రీ మూడో సంవత్సరం లేదా అంతకంటే పై స్థాయిలో చదువుతున్నవారు, డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ (RA) పేపర్‌ను ప్రవేశపెట్టారు. GATE 2027లో కొత్తగా రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ పేపర్‌ చేరినప్పటికీ మొత్తం టెస్ట్‌ పేపర్ల సంఖ్య 30గానే ఉంటుంది. గతంలో ప్రత్యేక పేపర్‌గా ఉన్న టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఫైబర్‌ సైన్స్‌ను ఇప్పుడు ఇంజినీరింగ్‌ సైన్సెస్‌ (XE)లో ఒక సెక్షన్‌గా చేర్చారు. GATE స్కోర్‌ను ఉన్నత విద్యలో ప్రవేశాలతో పాటు కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియలో కూడా పరిగణనలోకి తీసుకుంటారు. GATE 2027 స్కోర్‌ ఫలితాల ప్రకటన తేదీ నుంచి మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది.

GATE 2027 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

GATE 2027లో అందుబాటులో ఉన్న పేపర్లు ఇవే..

  • ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ (AE)
  • అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ (AG)
  • ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌ (AR)
  • బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ (BM)
  • బయోటెక్నాలజీ (BT)
  • సివిల్‌ ఇంజినీరింగ్‌ (CE)
  • కెమికల్‌ ఇంజినీరింగ్‌ (CH)
  • కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (CS)
  • కెమిస్ట్రీ (CY)
  • డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (DA)
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (EC)
  • ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ (EE)
  • ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (ES)
  • ఎకాలజీ అండ్‌ ఎవల్యూషన్‌ (EY)
  • జియోమాటిక్స్‌ ఇంజినీరింగ్‌ (GE)
  • జియాలజీ అండ్‌ జియోఫిజిక్స్‌ (GG)
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ (IN)
  • మ్యాథమెటిక్స్‌ (MA)
  • మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ME)
  • మైనింగ్‌ ఇంజినీరింగ్‌ (MN)
  • మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ (MT)
  • నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌ (NM)
  • పెట్రోలియం ఇంజినీరింగ్‌ (PE)
  • ఫిజిక్స్‌ (PH)
  • ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ (PI)
  • రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ (RA)
  • స్టాటిస్టిక్స్‌ (ST)
  • ఇంజినీరింగ్‌ సైన్సెస్‌ (XE)
  • హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ (XH)
  • లైఫ్‌ సైన్సెస్‌ (XL)

గుర్తింపు పొందిన ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ తదితర విభాగాల్లో డిగ్రీ మూడో సంవత్సరం లేదా అంతకంటే పై స్థాయిలో చదువుతున్నవారు GATE 2027కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే సంబంధిత డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులు. GATE 2027కు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఒక్క అభ్యర్థి ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలి. రెండు పేపర్లు రాయాలనుకునే అభ్యర్థులు ఒకే దరఖాస్తులో రెండో పేపర్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే అవి తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. చెల్లించిన దరఖాస్తు ఫీజు తిరిగి చెల్లించరు.

ఇవి కూడా చదవండి

దరఖాస్తు ఫీజు కింద ఒక్కో టెస్ట్‌ పేపర్‌కు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఇతర కేటగిరీల అభ్యర్థులు, విదేశీ విద్యార్థులకు ఒక్కో పేపర్‌కు రూ.2000 చొప్పున ఫీజు చెల్లించాలి. GATE 2027 పరీక్షను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు (MCQs), మల్టిపుల్‌ సెలక్ట్‌ ప్రశ్నలు (MSQs), న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ (NAT) ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు. మొత్తం 65 ప్రశ్నలకు మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షలు శని, ఆదివారాల్లోనూ జరుగుతాయి. రోజుకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. GATE 2027కు దరఖాస్తు చేసే అభ్యర్థులు పేపర్‌ ఎంపిక, అర్హత, ఫీజు, పరీక్ష విధానం తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.

GATE 2027 ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 5, 2026.
  • పరీక్ష తేదీలు: 2027, ఫిబ్రవరి 6, 07, 13, 14, 20, 21 తేదీల్లో
  • పరీక్ష సమయాలు: ఉదయం 9:30 నుంచి 12:30, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30

GATE 2027 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us