డ్రగ్స్‌ ‘గ’మ్మత్తులో కాకినాడ చిత్తు

కాకినాడ నగరం డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్‌కు అడ్డాగా మారింది. విద్యార్థులు, యువకులే లక్ష్యంగా డ్రగ్స్ దందాను నడిపిస్తున్నారు. భావనారాయణ సెంటర్‌ను అడ్డాగా చేసుకుని జోరుగా డ్రగ్స్‌ అమ్మకాలు సాగిస్తున్నాయి.

డ్రగ్స్‌ ‘గ’మ్మత్తులో కాకినాడ చిత్తు

Updated on: Jun 11, 2020 | 3:49 PM

హైద్రాబాద్‌ వంటి మహా నగరాల్లో కలకలం రేపుతున్న డ్రగ్స్‌ మాఫియా.. నెమ్మదిగా జిల్లా సెంటర్లకు ఎగబాకింది. ప్రధాన పట్టణాల్లోని విద్యా సంస్థలను టార్గెట్‌ చేసుకొని వ్యాపారం జోరుగా సాగిస్తున్నాయి.

కాకినాడ నగరం డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్‌కు అడ్డాగా మారింది. విద్యార్థులు, యువకులే లక్ష్యంగా డ్రగ్స్ దందాను నడిపిస్తున్నారు. భావనారాయణ సెంటర్‌ను అడ్డాగా చేసుకుని జోరుగా డ్రగ్స్‌ అమ్మకాలు సాగిస్తున్నాయి. ఈ స్మగ్లింగ్ గ్యాంగ్‌లు పోలీసుల కన్నుగప్పి మూడు కొకైన్.. ఆరు గంజాయి ప్యాకెట్లుగా సాగుతోంది. ముఖ్యంగా వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల నుండి , ఇతర దేశాల నుండి దిగుమతి చేస్తున్న ఎండీఎం, కొకైన్, బ్రౌన్ షుగర్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను ఎక్కువగా వినియోగిస్తూ యువత మత్తులో ముంచెత్తినట్లు తెలిసింది.

యువతను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ముఠా సభ్యులు వ్యాపారం చేస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రాగ్స్ మాఫియా సభ్యులు రోడ్డుపై డ్రాగ్స్ దందా ఏదేచ్చగా చేస్తున్నా… పట్టించుకునేవారు లేరంటూ మండిపడుతున్నారు. డ్రగ్స్‌ జిల్లాలో జోరుగా సాగుతున్నా అధికారుల చర్యలు మాత్రం శూన్యం అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.