ఏపీలో భిక్షగాళ్లకు ‘కోవిడ్ 19’ కిట్‌లు

| Edited By:

Jul 16, 2020 | 2:17 PM

కరోనాపై పోరాటంలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భిక్షగాళ్లు, చిత్తుకాగితాలు ఏరుకునే వారు, ఎలాంటి ఆధారం లేకుండా చెట్ల కింద, బస్టాండ్లలో ఉండే వారు కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటోంది

ఏపీలో భిక్షగాళ్లకు కోవిడ్ 19 కిట్‌లు
Follow us on

కరోనాపై పోరాటంలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భిక్షగాళ్లు, చిత్తుకాగితాలు ఏరుకునే వారు, ఎలాంటి ఆధారం లేకుండా చెట్ల కింద, బస్టాండ్లలో ఉండే వారు కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో వారికి అవగాహన కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. కోవిడ్ 19 కిట్‌లను కూడా ఇవ్వబోతోంది. అందులో ఆరు మాస్కులు, రెండు సబ్బులు ఉండగా.. మెప్మా ద్వారా ఈ కిట్‌ను వారికి పంపిణీ చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో తొలిసారి బుధవారం కృష్ణా జిల్లాలో ఈ కిట్‌లను పంపిణీ చేయనున్నారు.

విజయవాడ కార్పొరేషన్ పరిధితో పాటు మచిలీపట్నం, గుడివాడ, తిరుమూరు, జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, పెడన, ఉయ్యూరులో కలిపి మొత్తం 1991 కుటుంబాలకు ఈ కిట్‌లను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. కాగా మరోవైపు హోమ్ ఐసోలేషన్‌లో ఉండేవారికి ఫ్రీ కరోనా కిట్‌ను ఏపీ ప్రభుత్వం అందిస్తోన్న విషయం తెలిసిందే.