భద్రాద్రి జిల్లాలో బాల భీముడి జననం

|

Jun 12, 2020 | 11:29 AM

భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం జట్టి సంధ్య ఈ చిన్నారికి జన్మనిచ్చింది. ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన జట్టి సంధ్య కాన్పు కోసం ఓ ప్రైవేటు‌ ఆస్పత్రిలో చేరింది.

భద్రాద్రి జిల్లాలో బాల భీముడి జననం
Follow us on

బాల భీముడికి జన్మనిచ్చింది భద్రాద్రి జిల్లాలో ఓ త్లలి. అప్పుడే పుట్టిన శిశువు బరువు సాధారణంగా 3 నుంచి 3.5 కేజీల వరకు ఉంటారు. కానీ ఈ బాలుడు మాత్రం 5.5 కేజీల బరువుతో జన్మించాడు. భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం జట్టి సంధ్య ఈ చిన్నారికి జన్మనిచ్చింది. ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన జట్టి సంధ్య కాన్పు కోసం ఓ ప్రైవేటు‌ ఆస్పత్రిలో చేరింది. ఆమె బరువు అధికంగా ఉండటంతో.. కవలలు అయి ఉండొచ్చు అనుకున్నారు వైద్యులు. ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించగా బాబును ప్రసవించింది. డెలివరీ అయిన తర్వాత ఒకే శిశువు ఉండడంతో వైద్యులు, నర్సులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.