దైవదర్శనం చేసుకుని వెళ్తుండగా.. అనంతలోకాలకు…

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి కణంమెట్ట వద్ద తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు.. ఓ కారును ఢీ కొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక నగరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులంతా తమిళనాడు వాసులుగా గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని చెన్నై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న […]

దైవదర్శనం చేసుకుని  వెళ్తుండగా.. అనంతలోకాలకు...

Updated on: Jul 24, 2019 | 8:10 AM

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి కణంమెట్ట వద్ద తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు.. ఓ కారును ఢీ కొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక నగరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులంతా తమిళనాడు వాసులుగా గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని చెన్నై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us