Electric Buses: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో అందుబాటులోకి కొత్త బస్సులు

విశాఖ ప్రజలకు, విశాఖ పర్యాటక అందాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. అవును తాజాగా ప్రయాణికుల రద్దీని తగ్గించే, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఏపీఎస్ ఆర్టీసీ కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. తొలి విడతగా 30 ఎలక్ట్రిక్ బస్సులను RTC జేఎండీ ప్రారంభించారు.

Electric Buses: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో అందుబాటులోకి కొత్త బస్సులు
Visakhapatnam Gets 30 New Ev Metro Buses

Updated on: Nov 16, 2026 | 6:46 PM

ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో ఏపీఎస్ ఆర్టీసీ కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి విడత మొత్తం 30 ఎలక్ట్రిక్ మెట్రో బస్సులను విశాఖలోని గాజువాక ఆర్టీసీ డిపోలో RTC జేఎండీ శివప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం కింద ఉచిత ప్రయాణం అందించనున్నారు.

ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పీఎం ఈ-సేవ ఎలక్ట్రిక్ బస్సులను విశాఖలో ప్రారంభించడం శుభపరిణామం అన్నారు. భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ మీదే ఆధారపడి ఉందని.. ఈవీ బస్సుల్లో స్త్రీ శక్తి పథకంతో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఇక విశాఖ సిటీ పరిధిలో 30 ఈవీ మెట్రో సర్వీసులు ప్రారంభించామని.. సేఫ్టీ ప్రాధాన్యత, నాయిస్ పొల్యూషన్ లేకుండా కంఫర్ట్ జర్నీని సిటీలో ప్రయాణించే వారికి అందించాలని ఈ బస్సులు ప్రారంభించినట్టు RTC జేఎండీ శివప్రసాద్ తెలిపారు.

ప్రయాణికుల సౌకర్యార్థం భవిష్యత్తులో మరిన్ని ఫీచర్స్‌తో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కొత్త బస్సుల రాకతో విశాఖ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా విశాఖలోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు కూడా ప్రయాణం మరింత సులభతరం కానుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us