
పాములంటే అందరికీ భయమే.. పాము పేరు చెబితే చాలు అక్కడ ఒక్క సెకను కూడా ఉండరు.. వెంటనే.. అక్కడి నుంచి పరుగెత్తుతారు.. అలాంటి పాములు కళ్లెదుట నాట్యం చేస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా..?బుసల శబ్దం వింటే.. భయంతో ఒళ్లు జలదరించాల్సిందే.. విషయసర్పాల సయ్యాటను చూసి .. జనం పరుగులు తీశారు. ఈ ఘటన ఏపీలని తిరుపతి జిల్లా నాగలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జరిగింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పీహెచ్‌సీ పరిసరాల్లో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే.. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో సర్పాల సయ్యాటను చూసి జనం భయాందోళనకు గురయ్యారు.. ఈ క్రమంలో కొందరు దానిని ఆసక్తిగా తిలకిస్తూ.. సెల్ ఫోన్లలో చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
ఆసుపత్రికి వెళ్లే రోడ్డులో వెళ్లే మార్గం రద్దీగా ఉన్నప్పటికీ.. పాములు ఒకదాన్ని మరొకటి పెన వేసుకుని బుసలు కొడుతూ కనిపించాయి.. దాదాపు 20 నిమిషాల పాటు రెండు పాములు అలానే ఉండిపోయాయి.. దీంతో చేసేదేం లేక జనం అక్కడే ఉండిపోయారు.. దాదాపు 10 అడుగుల మేర ఉన్న రెండు సర్పాలను చూసి కొందరు భయపడితే.. మరి కొందరు మాత్రం అక్కడే నిలబడి చూశారు.
20నిమిషాల అనంతరం రెండు పాములు.. ముళ్ళ పొదల్లోకి వెళ్ళిపోగా.. అక్కడి నుంచి అంతా వెళ్లిపోయారు. మరోవైవు పాత పడ్డ శిధిలమైన భవనాలు పాములకు ఆశ్రయంగా మారాయని.. పాముల బెడదపై అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..