Jagan Cabinet 2.0: నాడు వైఎస్ఆర్ ప్రోత్సాహం.. నేడు వైఎస్ జగన్‌ కొత్త కేబినెట్‌లో చోటు.. ఎవరో తెలుసా..

|

Apr 10, 2022 | 9:13 PM

Vemuru MLA Merugu Nagarjuna: గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జునకు మంత్రి పదవి దక్కింది. ఏపీ కొత్త కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.

Jagan Cabinet 2.0: నాడు వైఎస్ఆర్ ప్రోత్సాహం.. నేడు వైఎస్ జగన్‌ కొత్త కేబినెట్‌లో చోటు.. ఎవరో తెలుసా..
Merugu Nagarjuna
Follow us on

గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే(Vemuru MLA)మేరుగు నాగార్జునకు(Merugu Nagarjuna) మంత్రి పదవి దక్కింది. ఏపీ కొత్త కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. సీఎం జగన్‌ కొత్తకేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నాగార్జున ఉన్నత విద్యావంతుడిగా గుర్తింపు పొందారు. 1994లో పీహెడీ పూర్తి చేశారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు ఆయన స్వగ్రామం. 2009తో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన నాగార్జున.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సాహంతో వేమూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో ఓడినా ఆయన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా నియామకమయ్యారు. వైఎస్సార్‌ మరణానంతరం 2012లో కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చిన నాగార్జున వైసీపీలో చేరారు. 2012 నుంచి వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా పనిచేశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి నక్కా ఆనంద్‌బాబు చేతిలో మరోసారి ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో తొలి నుంచి చురుగ్గా ఉన్న నాగార్జునకు 2019లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం కల్పించారు సీఎం జగన్‌. 2019 ఎన్నికల్లో కూడా ప్రత్యర్థి నక్కా ఆనంద్‌బాబుపైనే బరిలోకి దిగారు. ఈ సారి మాత్రం 10వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జగన్‌కు నమ్మినబంటుగా.. ఉన్న మేరుగ నాగార్జునకు మంత్రిపదవి వరించడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: Gudivada Amarnath: కార్పోరేటర్‌ నుంచి మంత్రి వరకు.. విశాఖ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌‌కు జగన్ కేబినెట్‌లో చోటు..

TRS: “ఛలో ఢిల్లీ..” టీఆర్‌ఎస్‌ దీక్షకు అంతా రెడీ.. తెలంగాణ భవన్‌లో భారీ ఏర్పాట్లు..