“అమ్మా”నుషం.. ఎంత పని చేశావమ్మా.. అనుమానాలు రేపుతున్న బావిలో మృతదేహం

|

Apr 16, 2022 | 11:28 AM

ఈ సృష్టిలో అమ్మతనం కన్నా గొప్పది ఏది ఉండదు అంటారు. తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డపట్ల ఆ తల్లి చూపే ప్రేమానురాగాలు ఎంతో మధురమైనవి. తన బిడ్డ కడుపు నింపడం కోసం తల్లి పస్తులుంటుంది. బిడ్డను ఏ చిన్న కష్టం...

అమ్మానుషం.. ఎంత పని చేశావమ్మా.. అనుమానాలు రేపుతున్న బావిలో మృతదేహం
Crime
Follow us on

ఈ సృష్టిలో అమ్మతనం కన్నా గొప్పది ఏది ఉండదు అంటారు. తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డపట్ల ఆ తల్లి చూపే ప్రేమానురాగాలు ఎంతో మధురమైనవి. తన బిడ్డ కడుపు నింపడం కోసం తల్లి పస్తులుంటుంది. బిడ్డను ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతుంది. నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డ పట్ల ఓ తల్లి క్రూరంగా ప్రవర్తించింది. భర్తతో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని బిడ్డను దారుణంగా హత్య చేసింది. భర్త తనను పుట్టింటికి పంపలేదన్న కారణంతో క్షణికావేశంలో చిన్నారిని బావిలో పడేసింది. అయితే తల్లి ఆచూకీ కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీసత్యసాయి(Sir Satyasai district) జిల్లాలోని బుక్కపట్నం (Bukkapatnam) మండల కేంద్రానికి చెందిన పద్మావతికి అమడగూరు మండలం గొల్లపల్లికి చెందిన వెంకటేష్‌తో వివాహమైంది. వీరికి నిహస్వి సంతానం. రెండురోజుల క్రితం తనను పుట్టింటికి పంపించాలని పద్మావతి భర్త వెంకటేశ్ ను కోరింది. వ్యవసాయ పనులు అయిపోయాక వెళ్లొచ్చులే అని వెంకటేశ్ చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన పద్మావతి తన బిడ్డ నిహస్విని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య, బిడ్డ కనిపించకపోవడంతో వెంకటేశ్ ఇరుగుపొరుగు ఆరా తీశాడు.

వారి కోసం వెతుకుతుండగా సమీపంలో ఉన్న బావిలో చిన్నారి నిహస్వి మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. వెంటనే కొందరు నీటిలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీశారు. పద్మావతి అదే బావిలో దూకి గల్లంతయ్యిందా లేక చిన్నారిని పడేసి వెళ్లిపోయిందా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. బావిలోకి దూకి ఉంటుందని భావించి, మోటారు సాయంతో నీటిని తోడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read

Property Auction: మీరు ప్రాపర్టీని కొనాలని ప్లాన్ వేస్తున్నారా? బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అద్భుతమైన అవకాశం..!

IPL 2022: 7.25 కోట్ల ఆటగాడు.. ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ మినహాయించి మిగతా ప్రదర్శన అంతంత మాత్రమే..!

Zomato: వారికి షాకిచ్చిన జొమాటో.. ఆ నిబంధనలు ఏకపక్షమంటూ ఆందోళనలు..