Vizianagaram MPDO: ఎంపీడీవో ఆఫీస్‌లో రగులుతోంది మొగలిపొద అంటూ రగిలిపోయారు

ఆఫీస్‌లో డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్. కాదు.. కాదు, అంతకంటే ఎక్కువే. రగులుతోంది మొగలిపొద అంటూ ఊగిపోయారు. ఫ్లోర్‌పై పడుకుని పైత్యం ప్రదర్శించారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండల ఆఫీస్‌లో

Vizianagaram MPDO: ఎంపీడీవో ఆఫీస్‌లో రగులుతోంది మొగలిపొద అంటూ రగిలిపోయారు
Vzm Mpdo Office

Edited By: Anil kumar poka

Updated on: Aug 14, 2021 | 7:45 PM

Garugubilli MPDO Office: ఆఫీస్‌లో డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్. కాదు.. కాదు, అంతకంటే ఎక్కువే. రగులుతోంది మొగలిపొద అంటూ ఊగిపోయారు. ఫ్లోర్‌పై పడుకుని పైత్యం ప్రదర్శించారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండల ఆఫీస్‌లో కనిపించిన దృశ్యాలివి. MPDO చంద్రరావు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ సింహాచలం పిచ్చివేషాలు, వికృత చేష్టలతో ఆ కార్యాలయంలో కాలు పెట్టాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.

అసలు.. ఆఫీసును బార్‌గా మార్చేశాడు MPDO చంద్రరావు. అక్కడే తాగినా, ఊగినా, మద్యం మత్తులో జోగినా అడిగేవారు లేకపోయేసరికి.. ఈసారి పబ్‌గా మార్చేశాడు. కంప్యూటర్ ఆపరేటర్‌ సింహాచలంతో కలిసి చిందులేయడం మొదలుపెట్టాడు చంద్రరావు.

తనతో పాటు మీరు కూడా తాగండి అంటూ కిందిస్థాయి సిబ్బందిని ఫోర్స్‌ చేసేవాడట చంద్రరావు. అతని వెకిలి వేషాలతో విసిగిపోయిన సిబ్బంది.. వీడియో తీసి.. బండారం బయటపెట్టారు. గతంలో కూడా సదరు ఎంపీడీఓ వారిపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం అక్కడ ఉంది.

Read also: “మా తెలుగు తల్లికి మల్లెపూదండ”కి అందిన పారితోషికం, ఈ పాట ఎప్పుడు.. ఎందుకు.. ఎవరు రాశారో, ఎలా పుట్టిందో తెలుసా.?

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ

హిజ్రాపై మోజుపడ్డ యువకుడు.. మాట ముచ్చటతో దగ్గరయ్యారు.. తనను దూరం చేయడం తట్టులేక..