Visakhapatnam: అమ్మో గిరినాగులు.. ఒక్కోటి 13 అడుగుల పొడవు.. ఎంత భీకరంగా బుసలు కొడుతున్నాయో..!

|

Apr 05, 2023 | 9:29 AM

చిన్నపాటి పాము కనిపిస్తే ఆగం ఆగం అయిపోయి, భయంతో పరుగులు తీస్తాం. అలాంటి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 పొడవైన గిరినాగు కంట పడితే.. అది కూడా రెండు భారీ పాములు ఒకేసారి బుసలు కొడితే.. అదిచూసిన వారి గుండె జారిపోవడం ఖాయం అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి.

Visakhapatnam: అమ్మో గిరినాగులు.. ఒక్కోటి 13 అడుగుల పొడవు.. ఎంత భీకరంగా బుసలు కొడుతున్నాయో..!
King Cobra
Follow us on

చిన్నపాటి పాము కనిపిస్తే ఆగం ఆగం అయిపోయి, భయంతో పరుగులు తీస్తాం. అలాంటి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 పొడవైన గిరినాగు కంట పడితే.. అది కూడా రెండు భారీ పాములు ఒకేసారి బుసలు కొడితే.. అదిచూసిన వారి గుండె జారిపోవడం ఖాయం అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు ఆ గ్రామస్తులు. రెండు భారీ కింగ్ కోబ్రాలు గ్రామంలోకి సంచరిస్తూ.. బుసలు కొట్టడం చూసి ప్రజలు బెదిరిపోయారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తారువలో రెండు గిరినాగులు కలకలం సృష్టించాయి. గ్రామానికి సమీపంలోని ఏటి గెడ్డలో బుసలు కొడుతూ భయపెట్టాయి గిరినాగులు. దాదాపు 13 అడుగుల పొడవు ఉండే ఒక్కో గిరినాగును చూసి జనం బెంబేలెత్తిపోయారు. వెంటనే సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందించారు. వైల్డ్ లైఫ్ సొసైటీ సహకారంతో.. చోడవరం రేంజర్ వర్మ.. గిరి నాగులను పట్టుకొని సేఫ్ గా అడవుల్లో విడిచిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తారువ గ్రామం డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్వగ్రామం కావడం విశేషం. అయితే, ఈ భారీ గిరినాగులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

బుసలు కొడుతున్న గిరినాగుల వీడియోలు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..