రెండు తలల పాము..దొరికితే పండగే !

|

Aug 28, 2019 | 1:51 PM

మీరేప్పుడైనా రెండు తలల పామును చూశారా..?ఎటు కావాలంటే అటు అవలీలగా పాకుతూ..ముడుచుకుంటూ ఇట్టే భయపెడుతున్న ఆ పామును చూస్తే ఎవరికైనా ఒళ్లు గగ్గుర్పొడుస్తుంది. దానికి రెండువైపులా తలలుండడమే ఈ భయానికి కారణం. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ అరుదైన పాము ప్రత్యక్షమైంది. ఆ పాము చూసేందుకు జనం భారీగా ఎగబడ్డారు.  పామును పట్టుకున్న స్థానికులు ఊరి చివర విడిచిపెట్టారు. అయితే, ఇటువంటి రెండు తలల పాములు స్మగ్లర్లకు కాసుల పంటపండిస్తాయి. కొన్ని సందర్భాల్లో రెండు తలల పాము ఖరీదు, లక్షలు […]

రెండు తలల పాము..దొరికితే పండగే !
Follow us on

మీరేప్పుడైనా రెండు తలల పామును చూశారా..?ఎటు కావాలంటే అటు అవలీలగా పాకుతూ..ముడుచుకుంటూ ఇట్టే భయపెడుతున్న ఆ పామును చూస్తే ఎవరికైనా ఒళ్లు గగ్గుర్పొడుస్తుంది. దానికి రెండువైపులా తలలుండడమే ఈ భయానికి కారణం. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ అరుదైన పాము ప్రత్యక్షమైంది. ఆ పాము చూసేందుకు జనం భారీగా ఎగబడ్డారు.  పామును పట్టుకున్న స్థానికులు ఊరి చివర విడిచిపెట్టారు. అయితే, ఇటువంటి రెండు తలల పాములు స్మగ్లర్లకు కాసుల పంటపండిస్తాయి. కొన్ని సందర్భాల్లో రెండు తలల పాము ఖరీదు, లక్షలు దాటి కోట్లు కూడా పలుకుతుందంటే అర్థం చేసుకోవచ్చు ఈ రకం పాములకు ఎంత డిమాండ్‌ ఉందో..ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని పొదలు నేలమట్టమయ్యాయి. దీంతో పొదల్లో దాగివున్న రకరకాల పాములు నివాసయోగ్యమైన స్థలం వెతుక్కుంటూ ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల అనేక రకాల పాములను గ్రామస్తులు చంపేస్తున్నారు. ఇటువంటి అరుదైన సర్ప జాతి కనిపించినప్పుడు జంతు సంరక్షణ శాఖ వారికి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.