Andhra Pradesh: స్పీడ్ బ్రేకర్ దాటుతున్న ఆర్టీసీ బస్సు..కట్ చేస్తే.. వేగంగా వెనుక నుంచి వచ్చి..

విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరంలోని పూల్ బాగ్ అయ్యప్పనగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్పీడ్ బ్రేకర్స్ దాటుతున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది.

Andhra Pradesh: స్పీడ్ బ్రేకర్ దాటుతున్న ఆర్టీసీ బస్సు..కట్ చేస్తే.. వేగంగా వెనుక నుంచి వచ్చి..
Two Buses Collided In Vizianagaram

Updated on: Nov 01, 2024 | 1:58 PM

విజయనగరంలోని పూల్ బాగ్ అయ్యప్పనగర్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లె వెలుగు బస్సును వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. దీంతో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలే కావడంతో ప్రాణాపాయం తప్పింది.  వారిని స్థానికులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. స్పీడ్ బ్రేకర్ దాటుతున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ప్రయాణికులకు తీవ్రంగా గాయలు కాకపోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు. ఇదంతా గమనించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆసుప్రతికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి