Wasps attack: విశాఖ ఏజెన్సీలో విషాదం నెలకొంది. కందిరీగల దాడిలో అయిదేళ్ళ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. జి మాడుగుల మండలం ఉడాపాలెంలో ఈ ఘటన జరిగింది. వంతల ఓవెల్ అనే అయిదేళ్ళ బాలుడిని సమీపంలోకి కట్టెల కోసం వెళ్తూ తమతో పాటు తీసుకెళ్ళారు తల్లిదండ్రులు. ఓ చోట బాలుడిని కూర్చోబెట్టి కట్టెలు సేకరిస్తునారు.
ఇంతలో ఓవెల్ గట్టిగా ఏడవడంతో ఉలిక్కిపడిన తల్లిదండ్రులు బాలుడి దగ్గరకు వెళ్ళాడు. కందిరీగల దాడిలో అప్పటికే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఈవెల్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ తండాలో అంతా విషాదం అలముకుంది. బాలుడి తల్లిదండ్రులు పిల్లాడికోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో ఘోరం.. ఇద్దరు మహిళలు దారుణ హత్య
గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఘోరం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు అతి కిరాతకంగా దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక నాగార్జున నగర్‌లో ఇంట్లో ఉన్న తల్లి, కూతురులను పొడిచి చంపాడు ఒక దుండగుడు. దీంతో ఇంట్లోనే అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రత్యూష, పద్మావతిలుగా గుర్తించారు పోలీసులు.
పోలం వివాదంలో ఈ జంట హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన స్పాట్‌కు చేరుకున్నారు. దుండగుడు ఇద్దరు మహిళల్ని అత్యంత కిరాతకంగా చంపుతోన్న దృశ్యాలు చుట్టపక్కల వాళ్లు తీసిన వీడియోల్లో రికార్డయ్యాయి.
Read also: Krishna District: పద్దతి మార్చుకోకపోతే తాట తీస్తాం.. రౌడీ షీటర్లకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్..!