గ్రామంలోకి ‘ఘోస్ట్ రైడర్’ వచ్చింది భయ్యో.! డ్రైవర్ లేకుండానే నిప్పులు కక్కుతూ దూసుకెళ్లిన ట్రాక్టర్
డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్ ఊరంతా చుట్టేసింది...! అదీ కూడా మామూలుగా కాదు నిప్పులు వెదజల్లుతూ..! ఇంతకు ఎక్కడ అనుకుంటున్నారా..? నంద్యాల జిల్లా కేంద్రం శివారులోని చాబోలు గ్రామంలో జరిగిందీ ఘటన. పశువులకు మేతగా వేసే గడ్డిని ట్రాక్టర్‌లో తీసుకొస్తుండగా.. ఆ గడ్డికి హైటెన్షన్ కరెంట్ వైర్లు తాకడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్ ఊరంతా చుట్టేసింది…! అదీ కూడా మామూలుగా కాదు నిప్పులు వెదజల్లుతూ..! ఇంతకు ఎక్కడ అనుకుంటున్నారా..? నంద్యాల జిల్లా కేంద్రం శివారులోని చాబోలు గ్రామంలో జరిగిందీ ఘటన. పశువులకు మేతగా వేసే గడ్డిని ట్రాక్టర్‌లో తీసుకొస్తుండగా.. ఆ గడ్డికి హైటెన్షన్ కరెంట్ వైర్లు తాకడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. బాగా ఎండిన గడ్డి కావడంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఇక వెంటనే గమనించిన డ్రైవర్ ట్రాక్టర్‌ను వదిలేసి బయటకు దూకేశాడు. ఇంకేముందు నిప్పులు చిమ్ముతూ ఊర్లోకి ఇలా దూసుకెళ్లింది ట్రాక్టర్. దాని వెంట పడి చివరికి మంటలను అదుపులోకి తెచ్చారు గ్రామస్తులు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ట్రాక్టర్ ట్రక్‌లో ఉన్న గడ్డి అంతా కాలిపోయింది. ప్రమాదంలో ఎవరికి హాని జరక్కపోవడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..