Viral News: వామ్మో..ఇదేంట్రా బాబోయ్‌..! మండపేట కోడిగుడ్డు మామూలుగా లేదు.. చూస్తే గుడ్లు తేలేయాల్సిందే..!!

|

Aug 01, 2022 | 8:05 AM

సాధారణంగా కోడిగుడ్డు అంటే 50 గ్రాముల నుండి 60 గ్రాముల బరువుంటుంది. కానీ, ఇక్కడ మాత్రం కోడిగుడ్డు సైజు చూస్తేనే కడుపు నిండిపోయేలా ఉంది. ఇక ఇక్కడి నుంచే ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి.

Viral News: వామ్మో..ఇదేంట్రా బాబోయ్‌..! మండపేట కోడిగుడ్డు మామూలుగా లేదు.. చూస్తే గుడ్లు తేలేయాల్సిందే..!!
Egg
Follow us on

Big Egg:  గుడ్లు తినడం అంటే కొంతమందికి చాలా ఇష్టం. దాదాపు ప్రతిరోజు గుడ్లతో తయారుచేసిన వంటకాలని తింటారు. ఇకపోతే, కరోనా కాలంలో ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు. ఇమ్యూనిటీ పెంచుకోవాలనే క్రమంలోనే చాలామంది ప్రతిరోజు గుడ్లు తినటం అలవాటుగా చేసుకుంటున్నారు. అయితే, సాధారణంగా కోడిగుడ్డు అంటే 50 గ్రాముల నుండి 60 గ్రాముల బరువుంటుంది. కానీ, ఇక్కడ మాత్రం కోడిగుడ్డు సైజు చూస్తేనే కడుపు నిండిపోయేలా ఉంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కోడిగుడ్డు సైజు స్థానికుల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. మండపేట మండలం ఆర్తమూరులోని కోళ్ల ఫారంలో ఈ వింత చోటుచేసుకుంది. ఇక్కడ ఏకంగా 111 గ్రాముల కోడిగుడ్డు ఉత్పత్తి అయింది. అది చూసిన ఫారం యాజమాని,స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫారంలో ఇంత పెద్ద గుడ్డును చూడటం ఇదే మొదటిసారి అంటున్నారు.

గతంలో అతి పెద్ద కోడిగుడ్డు ద్వారపూడిలోని ఎస్‌బీఎస్ఆర్ పౌల్ట్రీలో ఉత్పత్తి కాగా.. అప్పట్లో అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఆ తర్వాత ఆ స్థాయిలో మండపేట మండలం అత్తమూరులోనే ఇంత పెద్ద గుడ్డు కనిపించింది. ఇక ఇక్కడి నుంచే ఉత్తరాది రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశా, బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతుంటాయి. నేపాల్ దేశానికి కూడా ఇక్కడి గుడ్లు జనవరిలో ఎగుమతి అవుతుంటాయని యజమానులు చెబుతున్నారు. దీనిపై పశు వైద్యాధికారులు మాట్లాడుతూ ఆర్తమురు పౌల్ట్రీ లో 111 గ్రాముల గుడ్డు ఉత్పత్తి జన్యు పరమైన లోపాలతో ఒక్కోసారి ఇలా అతి పెద్ద లేదా అతి చిన్న గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయని పశువైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి