ఎరక్క పోయి వచ్చిన దొంగ..ఇలా ఇరుక్కుపోయాడు

|

Sep 05, 2019 | 6:32 PM

ఊళ్లో చోరీ చేద్దామని వచ్చాడు..పాపం గ్రామస్తుల కంటపడ్డాడు..ఇంకేముందీ..చేతికందిన కర్రలు, బరిసెలె తీసుకుని స్థానికులు ఆ దొంగను వెంబడించారు. దీంతో బతుకు జీవుడా అంటూ..పరుగులంకించాడు. పాపం చీకట్లో దారి కనిపించక పాడుబడిన బావిలో పడిపోయాడు. అది పాడుబడినా పాతబావి, పైగా అందులో నీళ్లు లేకపోవడంతో..అతడికి నడుము విరిగి లేవలేకపోయాడు. అలా మూడురోజులుగా దొంగ బావిలో మూలుగుతూ పడిఉండగా గ్రామస్థులు ఈరోజు దొంగను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల సాయంతో గ్రామస్థులు దొంగను బయటకు తీసి బంధువులకు అప్పగించారు. ఈ […]

ఎరక్క పోయి వచ్చిన దొంగ..ఇలా ఇరుక్కుపోయాడు
Follow us on

ఊళ్లో చోరీ చేద్దామని వచ్చాడు..పాపం గ్రామస్తుల కంటపడ్డాడు..ఇంకేముందీ..చేతికందిన కర్రలు, బరిసెలె తీసుకుని స్థానికులు ఆ దొంగను వెంబడించారు. దీంతో బతుకు జీవుడా అంటూ..పరుగులంకించాడు. పాపం చీకట్లో దారి కనిపించక పాడుబడిన బావిలో పడిపోయాడు. అది పాడుబడినా పాతబావి, పైగా అందులో నీళ్లు లేకపోవడంతో..అతడికి నడుము విరిగి లేవలేకపోయాడు. అలా మూడురోజులుగా దొంగ బావిలో మూలుగుతూ పడిఉండగా గ్రామస్థులు ఈరోజు దొంగను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల సాయంతో గ్రామస్థులు దొంగను బయటకు తీసి బంధువులకు అప్పగించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని గంగువారి సిగడాం గ్రామంలో చోటుచేసుకుంది.