Andhra: సొంత అక్క ఇలా చేస్తదనుకోలేదు.. కోర్టులో ఆ మహిళ ఏం చేసిందంటే..

తెనాలి పురపాలక సంఘంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న కమలమ్మ ఎప్పటిలాగే నిన్న కూడా కోర్టుకు వచ్చింది. తన తల్లికి చెందిన ఆస్తి విషయంలో సొంత అక్కతో వివాదం ఉంది. ఈ విషయం కోర్టులో ఉండటంతో వాయిదాలున్నప్పుడల్లా కమలమ్మ కోర్టుకు వస్తుంది. తన తల్లి ఆస్తిని అక్క కొడుకు ఆక్రమించుకుని తనకు రాకుండా చేయడంతో కోర్టును ఆశ్రయించింది.

Andhra: సొంత అక్క ఇలా చేస్తదనుకోలేదు.. కోర్టులో ఆ మహిళ ఏం చేసిందంటే..
Tenali court incident

Edited By:

Updated on: Mar 07, 2026 | 2:27 PM

తెనాలి పురపాలక సంఘంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న కమలమ్మ ఎప్పటిలాగే నిన్న కూడా కోర్టుకు వచ్చింది. తన తల్లికి చెందిన ఆస్తి విషయంలో సొంత అక్కతో వివాదం ఉంది. ఈ విషయం కోర్టులో ఉండటంతో వాయిదాలున్నప్పుడల్లా కమలమ్మ కోర్టుకు వస్తుంది. తన తల్లి ఆస్తిని అక్క కొడుకు ఆక్రమించుకుని తనకు రాకుండా చేయడంతో కోర్టును ఆశ్రయించింది. అయితే, వివాదం కోర్టులో ఉండగానే ఆమె తల్లి భర్త చనిపోయారు. దీంతో ఆమె ఆవేదన మరింత అధికమయింది. అప్పటి నుండి తన లాయర్ వద్ద విషయాన్ని చెప్పుకొని న్యాయం చేయాలంటూ వేడుకుంటుంది. వాయిదాల చుట్టూ తిరగడం తప్ప తనకు న్యాయం జరగదన్న నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే తన కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని లాయర్ ను అడిగింది. అయితే, లాయర్ దస్తావేజులు ఇవ్వకపోవడంతో పాటు తనకు సరిగా వాయిదాల వివరాలు కూడా చెప్పడం లేదని వాపోయింది.

ఈ క్రమంలోనే నిన్న కోర్టుకు వచ్చిన సమయంలో తీవ్ర మనస్థాపంలో ఉన్న కమలమ్మ తన వెంట బాటిల్ పెట్రోల్ తెచ్చుకుంది. కోర్టు ప్రాంగణంలోనే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుంది. ఇది గమనించి స్థానికులు వెంటనే ఆమెను వారించారు. అదే సమయంలోనే అక్కడే ఉన్న కోర్టు కానిస్టేబుల్ వచ్చి ఆమెను రక్షించి నీళ్లు పోసారు. అనంతరం ఆమెను పిఎస్ కు తరలించారు.

వీడియో చూడండి..

పిఎస్ లో కూడా తన తల్లి ఫోటో పట్టుకొని ఆందోళన కొనసాగించింది. లాయర్ పై కూడా ఆరోపణలు చేయడంతో ఈ విషయాన్ని పోలీసులు ఆ లాయర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే లాయర్ పిఎస్ కు వచ్చి ఆమె కేసుకు సంబంధించిన దస్తావేజులు ఇచ్చారు. దీంతో ఆమె వాటిని తీసుకొని పిఎస్ నుండి వెళ్లిపోయారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us