
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గింది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. తెల్లవారు జామున కొంత చలి ఉన్నప్పటికీ.. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతూ హీటెక్కిస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.. ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలిపింది.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్, యానములో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.
సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.
సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గమనిక :- రాగల 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, యానములో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు /ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నాయి.. వీటి ప్రభావంతో వచ్చే మూడు రోజులు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
శనివారం, ఆదివారం, సోమవారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. .
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..