
బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఎండలు.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి నైరుతి, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు అనగా 23 ఫిబ్రవరి 2026, ఉదయం 0830 గంటలకు అదే ప్రాంతంలో కొనసాగుతున్నది . దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ వైర్తు వరకు విస్తరించి ఉంది. ఇది దాదాపు ఈశాన్య దిశగా కదులుతూ రాగల 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.
గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ నుండి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు ఒడిశా అంతరముగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించినది..
దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి మరఠ్వాడా వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి విస్తరించినది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.
సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.
గమనిక :- రాగల 2 రోజుల్లో కోస్తాంద్ర – రాయలసీమలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుండి మరాత్వాడ వరకు ఏర్పడిన ద్రోణి, అలాగే గ్యాంగ్టిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుండి తూర్పు కోస్తా ఆంధ్ర తీరం వరకు ఒడిస్సా మీదుగా సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఏర్పిడిన మరొక ద్రోణి ప్రభావంతో.. రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈరోజు – రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..